బీజేపీ  తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు దశకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరు అయ్యారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరు కలిసి టిఆర్ ఎస్ అరాచక పాలనకు చరమగీతం పాడాలి అని ఆమె అన్నారు. తెలంగాణ నీళ్ళు, నియామకాలు, నిధులు కోసం ఏర్పడిన ఈ రాష్ట్రం పక్క దారి పట్టింది అని వ్యాఖ్యలు చేసారు. నిరుదోగ్య సమస్య పెరిగింది అని అన్నారు ఆమె.  ప్రధాని మోదీ చల్లని దయ వల్ల రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సాకారం చేసి  తెలంగాణ రైతులకు యూరియా అందించారు అని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రజల సేవకోసం  బీజేపీ నాయకులు కార్యకర్తలు కట్టుబడి ఉన్నారు అన్నారు ఆయన. ఈ దేశంలో ఒక్కనిషి ఆకలితో ఉండకూడదు అని రేషన్ ఉచితంగా ఇచ్చారు అని తెలిపారు. తెలంగాణ ప్రజల నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానన్న కేసీఆర్ ఒక్కరికీ కూడా ఇవ్వలేదు అని అన్నారు బండి. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేస్తా అని చెప్పి మరిచింది...కారణం మజ్లీస్ ఒవైసీ అంటే భయం అని అన్నారు ఆమె. టీఆరెస్ ప్రభుత్వ స్టీరింగ్ ఎంఐఎం చెతిలో ఉంది అని వ్యాఖ్యానించారు.

దళితులకు టీఆరెస్ ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది.. కానీ బీజేపీ 1 ఒక లక్ష కు పైగా లోన్ ఇచ్చారు అని తెలిపారు. మోదీ పసాల భీమ యోజన పథకం ద్వారా రైతులకు ప్రయోజనం చేశారు అని అన్నారు. యుతకు ఉద్యోగం, రైతులకు యూరియా, మహిళ కోసం స్వశక్తి లోన్స్, భేటీ బచావో భేటీ బడవి ద్వారా మోదీ అందరికీ న్యాయం చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ధర్మం కోసం , ధర్మంగా ఈ బండి సంజయ్ ఈ యాత్ర చేస్తున్నారు అని అన్నారు ఆయన. మీ అందరి ముందు శిరస్సు వంచు నమస్కరించి మీకు , ఈ తెలంగాణ ప్రజల కు కోరుకునే ది ఒక్కటే మీ అందరికి బాగుకోసం బీజేపీ కి ఓటు వేయాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp