ఏపీ మంత్రివర్గంలో మార్పులకు రూట్ క్లియర్ అవుతుంది....త్వరలోనే 100 శాతం మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. ఇదే అంశాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా చెప్పేశారు. అటు మంత్రులు కూడా మానసికంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక పదవులు ఉండవని ఫిక్స్ అయిపోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల ఓ మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని సైతం....మా పదవులు ఎప్పుడు ఊడతాయో మాకే తెలియదని అన్నట్లు మాట్లాడారు.

అంటే ఇప్పుడున్న 25 మంది మంత్రులని పక్కనబెట్టి కొత్తగా 25 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. అయితే కృష్ణా జిల్లా విషయానికొస్తే...ప్రస్తుతం ముగ్గురు మంత్రులు జగన్ క్యాబినెట్‌లో ఉన్నారు. పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఉన్నారు. ఇక వీరి స్థానాల్లో జిల్లాలో మరో ముగ్గురుకు అవకాశం దక్కొచ్చు. ముగ్గురు కాకపోయిన కనీసం ఇద్దరికైనా జిల్లాలో మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే మంత్రి పదవులు దక్కించుకోవాలని పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్థసారథి, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణులు మొదట లైన్‌లో ఉన్నారు. అలాగే కొడాలి సైడ్ అయితే కమ్మ వర్గం కోటాలో ఛాన్స్ కొట్టేయాలని వసంత కృష్ణప్రసాద్ చూస్తున్నారు. అటు మేకా వెంకట ప్రతాప్ కూడా తనకు ఏదైనా ఛాన్స్ రాకపోతుందా అని ఎదురుచూస్తున్నారు.

అయితే కాపు వర్గానికి చెందిన పేర్ని నాని తప్పుకుంటే...అదే వర్గానికి చెందిన సామినేని ఉదయభానుకు పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న సామినేని...మొదట విడతలోనే పదవి వస్తుందని ఆశించారు. కానీ పేర్నికి పదవి దక్కడంతో సామినేనికి ఛాన్స్ రాలేదు. ఇప్పుడు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో పేర్ని పదవి కోల్పోవడం ఖాయమని తెలిసిపోతుంది. దీంతో పేర్ని ప్లేస్‌ని సామినేనితోనే రీప్లేస్ చేస్తారని తెలుస్తోంది. ఈ విషయం అధికారంగా తెలిసేవరకు సరైన క్లారిటీ ఉండదనే చెప్పొచ్చు. మరి చూడాలి పేర్ని బదులు సామినేని జగన్ క్యాబినెట్‌లోకి వస్తారేమో.  

మరింత సమాచారం తెలుసుకోండి: