ఏపీలో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నా సరే కొందరు అధికారులు మాత్రం వివాదాలతో సావాసం చేయడం తల నొప్పిగా మారింది. కేసులు నమోదు చేసే విషయంలో వెనుకా ముందు ఆలోచించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై హైకోర్ట్ ఎన్ని సార్లు వార్నింగ్ లు ఇచ్చినా సరే కొందరు అధికారులు మాత్రం ఇష్టం వచ్చినట్టు కేసులు నమోదు చేస్తున్నారని అంటున్నారు కొందరు. ఇదిలా ఉంటే తాజాగా చిత్తూరు జిల్లాలో ఒక కేసు బయటకు వచ్చింది. చౌడేపల్లి మండలం చారాల గ్రామానికి చెందిన అడవిపల్లి రమణ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు కుమారులు కె విజయ్ కుమార్, జనార్ధన్ ఆరోపణలు చేసారు.

మదనపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు తమ తండ్రిని ఓ కేసు నిమిత్తం పిలిపించి అక్కడకి వెళ్ళాక గుర్తుతెలియని వ్యక్తులు సుమోలో ఎక్కించుకుని పరారైనట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తండ్రికి ప్రాణహాని ఉందని ఎక్కడ ఉన్నారో తెలపాలంటూ డిమాండ్ చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఎస్సీ లైన తమపైనే పదికి పైగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించారని ఆరోపిస్తున్న బాధితులు...  తాము తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు కావడంతో నే ఇలాంటి వేధింపులకు పోలీసులు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బోయకొండ గంగమ్మ ఆలయానికి టిడిపి కి చెందిన మాజీ ఆలయ చైర్మన్ ఎస్ కే రమణ రెడ్డి తో కలిసి టెంపుల్ కు వెళ్లి వస్తున్న నేపథ్యంలో తమపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు బాధితులు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు.  కిడ్నాప్ కు గురైన  తమ తండ్రిని వెంటనే చూపించాలని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అలాగే పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి మొర పెట్టుకున్నట్లు విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: