ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌న స‌గం పాల‌నా కాలం పూర్తి చేసుకుంటున్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యి త‌న కేబినెట్ ను ఏర్పాటు చేసిన వెంట‌నే
రెండున్న‌రేళ్ల త‌ర్వాత కేబినెట్‌ను పూర్తిగా మారుస్తాన‌ని చెప్పారు. ఇక ఇప్పుడు కేబినెట్ మార్పులు.. చేర్పులు.. నూత‌న కేబినెట్ కూర్పుపై పెద్ద ఎత్తున చ‌ర్చ వైసీపీ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. కొత్త కేబినెట్‌లో కి ఎవ‌రు వ‌స్తారు ?  ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారు ? అనేది పూర్తిగా ముఖ్య‌మంత్రి ఇష్ట‌మ‌ని మంత్రులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో కొత్త కేబినెట్‌లో ఎవ‌రెవ‌రు ఉంటార‌నే ది పూర్తిగా ఎవ్వ‌రికి తెలియ‌డం లేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్త మంత్రుల‌పై జ‌రుగుతోన్న ప్ర‌చారంలో భాగంగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. జ‌గ‌న్ కేబినెట్‌లో అత్యంత సీనియ‌ర్ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని కూడా తొల‌గిస్తున్నార‌ట‌. ఆయ‌న తో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మ‌రో మంత్రి, డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ దాస్ ను కూడా పూర్తిగా ప‌క్క‌న పెట్టేస్తున్నార‌ట‌. అయితే ఈ ఇద్ద‌రు మంత్రులుగా త‌ప్పుకున్నా ఈ రెండు ఫ్యామిలీల్లో మాత్రం మంత్రి ప‌ద‌వి అలాగే ఉండ బోతోంది.

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి త‌మ్ముడైన‌ చిత్తూరు జిల్లా తంబ‌ళ్ల‌ప‌ల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వార‌క‌నాథ‌రెడ్డి కేబినెట్లోకి ఎంట్రీ ఇస్తార‌ట‌. అలా పెద్దిరెడ్డికి మంత్రి ప‌ద‌వి లేక‌పోయినా ఆయ‌న త‌మ్ముడి ద్వారా చ‌క్రం తిప్పుకునే ఛాన్స్ ఉంది. ద్వార‌క‌నాథ్ కు మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు సీఎం కూడా సుముఖంగా ఉన్నార‌ట‌.

ఇక ధ‌ర్మాన కృష్ణ దాస్‌ను త‌ప్పిస్తే.. ఆయ‌న సోద‌రుడు మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద రావును కేబినెట్లో కి తీసుకుంటార‌ని తెలుస్తోంది. ధ‌ర్మాన ప్ర‌సాద రావు కూడా ఎప్ప‌టి నుంచో త‌న‌కు ప్ర‌యార్టీ లేద‌ని వాపోతున్నారు. ఏదేమైనా ఈ రెండు కుటుంబాల్లో ఇప్పుడు ఉన్న మంత్రులు త‌ప్పుకున్నా కొత్త మంత్రులు ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. మంత్రి ప‌ద‌వి అలాగే ఉండ‌బోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: