ఆటో రజనీ మూవీ ఓపెనింగ్ రామానాయుడు స్టూడియోలో జరగగా ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి కొడాలి నానీ హాజరు అయ్యారు. జొన్నలగడ్డ హారి హీరోగా ,శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకుడుగా ఈ సినిమా వస్తుంది. ఇక కొడాలి నాని కెమెరా స్విచ్ ఆన్ చేయగా,  ఎంపి నందిగామ సురేష్ క్లాప్ ఇచ్చారు. ఇక కొడాలి నానీ మాట్లాడుతూ... వంద రూపాయలు టిక్కెట్ అయితే కోర్టు అనుమతి వుంది అని రెట్లు పెంచుకుంటున్నారు అలాంటిది ఏమి లేకుండా  అని ఆయన అన్నారు. నలుగురు హీరోలు నలుగురి నిర్మాతల ది కాదు అని...

ఇండస్ట్రీ లైట్ మెన్ దగ్గరనుంచి అందరూ బాగుండాలని మా నిర్ణయం వుంటుంది అని తెలిపారు. నలుగురు చెప్పిన విధంగా జగన్ నడవరు అందరూ కోసం జగన్ నిర్ణయం తీసుకుంటారు అని స్పష్టం చేసారు. ఇది ఎప్పటి నుంచో వున్న సమస్య గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే అని ఆయన స్పష్టం చేసారు.  తెలుగు సినిమాని ఎంతో కొంత షూటింగ్ జరపాలి అని కోరుకుంటున్నాము అన్నారు ఆయన. కొంత మంది కి లాభాలు తెచ్చి పెట్టాలని విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకుండా అడ్డగోలుగా టిక్కెట్ రెట్లు పెంచారు అని ఆరోపించారు.

చిన్న సినిమా లు ఆడాలి పెద్ద సినిమాలు ఆడాలి అని స్పష్టం చేసారు. పవన్ కళ్యాణ్ గారు అహు అంటే అదిరి బెదిరి పోయే వాళ్ళము కాదు అని అన్నారు. చిత్ర పరిశ్రమపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కొడాలి నాని... జగన్ మోహన్ రెడ్డికి ఎవరి మద్దతు అవసరం లేదు అని స్పష్టం చేసారు. జగన్ మోహన్ రెడ్డిని భయపెట్టే మగాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు అని అన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ కు జీవిత కాలం టైమ్ ఇస్తున్నా, జగన్ ను టచ్ చేసి చూడు అని సవాల్ చేసారు. పవన్ కళ్యాణ్ జగన్ చిటికన వేలు కూడా తాకలేడు అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: