తాజా ఉపఎన్నికలలో బీజేపీ నేలచూపులు చూడాల్సి వచ్చింది. అంటే పశ్చిమ బెంగాల్ సహా పలు ప్రాంతాలలో ఓటమిని చవిచూసింది. అధికారం కోసం ఏమైనా చేసే బీజేపీ ఈసారి కూడా సాధారణ ఎన్నికలలో తమకే ప్రజలు పగ్గాలు ఇస్తారు అంటూ లేనిపోని సర్వేలు చూపిస్తూ మతలబు చేస్తుంది. అయితే దేశంలో ఈ పార్టీకి తరువాత ఎవరు కూడా తగిన విధంగా ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ప్రవర్తించలేదు. అంటే బీజేపీ తప్ప మరో అవకాశం లేదు అనేది ప్రజల భావన. ఇప్పుడు గనక ఎవరైనా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే వారికి ప్రజలు జై కొట్టే అవకాశాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. అంటే ఒకనాడు మమతా, కేసీఆర్ చేసిన ప్రయత్నాలకు నిజానికి ఇప్పుడు సరైన సమయం. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు రానున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే విభజించి పాలించు అనే సూత్రాన్ని పాటిస్తూ అందరి మధ్య చిచ్చుపెట్టి తాను అధికారం హస్తగతం చేసుకోవాలనే రాక్షస ఆలోచన తో ముందుకుపోతుంది. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు ఏకం కాకుండా ఆయా రాష్ట్రాలలో చిచ్చులు పెట్టేసింది. అదేమీ అర్ధం చేసుకునే పరిస్థితులలో ప్రజలు, ప్రభుత్వాలు కూడా లేనంత స్థితిని కల్పించి మరి తన వ్యూహాలను అమలు చేస్తుంది బీజేపీ. అందుకే ఆయా రాష్ట్రాలలో ఉన్న సమస్యలపై బీజేపీ అధిష్టానం తీవ్రంగా కృషి చేసి మరి సమాచారం తెప్పించుకొని ఆయా ప్రాంతాలలో గొడవలు సృష్టిస్తుంది. దీనితో వాటిని సరిచేసుకునే సరికే ఆయా ప్రాంతీయ పార్టీలకు సరిపోతుంది. దీనితో ఉమ్మడిగా పోరాడాలి అనే విషయం కూడా మరిచిపోతున్నారు.

ఈ వ్యూహంలో భాగంగానే మమతను కొంత కాలం ఆమె గురించి తప్ప మరొకటి ఆలోచించుకునే అవకాశం లేకుండా ఓడించారు. దీనితో మళ్ళీ ఇప్పటికి ఆమెకు సమయం కుదిరే అవకాశాలు ఉంటాయని బావించడము సరికాదేమో.. ఈలోపే మరో సమస్యను తెచ్చిపెట్టి దానిని తీర్చుకునే ప్రయత్నంలో సమయం అంతా వృధా అయిపోతుంది. ఇంక ఆయా రాష్ట్రాల లోని ప్రాంతీయ పార్టీలు ఉమ్మడిగా కలిసేది ఎన్నడూ, మాట్లాడుకునేది ఎన్నడూ, పోటీకి కలిసి దిగేది ఎన్నడూ.. ! ఈ వ్యూహం బీజేపీ రచించిందని ఆయా రాష్ట్రాలకు తెలిస్తే, వారి ప్రాంతాలలో గొడవలు ఎందుకు వస్తున్నది అర్ధం అవుతుంది, అప్పుడు సమస్య కోసం వెళ్లాలో, రాబోయే ఎన్నికల కోసం అడుగు వేయాలో అర్ధం అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp