ప‌శ్చిమ బెంగాల్ సీఎం మమ‌తా బెనర్జీ భ‌వానీపూర్ ఉప ఎన్నిక‌ల్లో జ‌య కేత‌నం ఎగురవేశారు. ప్ర‌త్య‌ర్థి బీజేపీ అభ్య‌ర్థిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో మ‌రో సారి బీజేపీ పై పైచేయి సాధించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మోడీ, అమిత్ షా లు ప్ర‌చారం చేసినా.. బీజేపీని మ‌ట్టి క‌రిపించి తృణ‌ముల్ కాంగ్రెస్ ను విజ‌య తీరాల‌కు ఒంటి చేత్తో లాక్కొచ్చిన మ‌మ‌త‌.. సీఎం ప‌ద‌విని చేప‌ట్టింది. అయితే, తాను మాత్రం ఎమ్మెల్యేగా బీజేపీ క్యాండిడేట్ సువెంద్ అధికారిపై ఒడిపోయారు.


దీంతో ఆరు నెలల్లోపు దీదీ త‌ప్ప‌క గెలావాల్సి ఉంటుంది. లేక పోతే త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి ఉంది.   దీంతో మ‌మ‌తా బెన‌ర్జీ కోసం గ‌తంలో భ‌వానీపూర్ నుంచి గెలిచిన తృణ‌ముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామ చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్య‌మయింది. మొద‌టి నుంచి మ‌మ‌తా బెన‌ర్జీకి పూర్తి ప‌ట్టున్న భ‌వానీపూర్‌లో దీదీ గెలుపు ఖాయ‌మే అనుకున్న‌ట్టుగా ఆమె గెలిచారు.  అయితే, ఈ ఎన్నిక కోసం తృణ‌ముల్ కాంగ్రెస్ పార్టీ రూ.154.28 కోట్లు ఖ‌ర్చు పెట్టింది.


ఈ విష‌యం.. ఎన్నిక‌ల ప్ర‌చారం, ఇత‌ర అవ‌స‌రాల కొసం పెట్టిన ఖ‌ర్చుపై నివేదిక‌ను ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించింది. అయితే, ఇది కేవ‌లం అధికారికంగా మాత్ర‌మే రూ.154.28 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని, ఇంకా అన‌ధికారంగా ఇంకా చాలా చేశార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అలాగే.. ఇటీవ‌ల త‌మిళ‌నాడు, పుదుచ్చేరి ఎన్నిక‌ల్లో అధికార పార్టీని ఓడించి పాల‌నా ప‌గ్గాల‌ను చేప‌ట్టిన ద్ర‌విడ మున్నెట్ర క‌ళ‌గం ( డీఎంకే ) రూ.114.14 కోట్లు ఖ‌ర్చు పెట్టింది.  ఎన్నిక‌ల్లో పార్టీలు చేసిన ఖ‌ర్చుల వివ‌రాలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేలా ఎన్నిక‌ల సంఘం త‌మ వెబ్‌సైట్‌లో ఉంచింది. అలాగే ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన అధికార  అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే )పార్టీ త‌మిళ‌నాడుతో పాటు పుద‌చ్చెరిలో ప్ర‌చారం కోసం రూ.57.33 కోట్లు ఖ‌ర్చు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: