చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించడం వైఎస్సార్ తెలంగాణా పార్టీ అంతిమ లక్ష్యం అన్నారు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. బీసీలను కులవృత్తులకే పరిమితం చేస్తారా? అని ఆమె నిలదీశారు. కేసీఆర్ గొర్రెలు కాస్తరా? కేటీఆర్ బర్లు కాస్తడా? అని ఆమె నిలదీశారు. హరీశ్ రావు చేపలు పట్టుకోమంటే పట్టుకుంటాడా? అని ప్రశ్నించారు. బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు అని 0.5 జనాభా ఉన్న వెలమలకు ఒక సీఎం, మూడు మంత్రి పదవులా? అని ఆమె నిలదీశారు.

50శాతం ఉన్న బీసీలకు మూడే పదవులా?  అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగనీయట్లే అంటూ విమర్శలు చేసారు. బీసీలను గొర్లు, బర్లు, చేపలకే పరిమితం చేశారు అని ఆవేదన వ్యక్తం చేసారు.  కేసీఆర్ కుటుంబానికి పదవులు.. బీసీలకు గొర్లు, బర్లా? అంటూ మండిపడ్డారు. బీసీలను కులవృత్తులకే పరిమితం చేస్తారా అని ఆమె నిలదీశారు. చేనేతలకు రూ.2వేలు ఇస్తే ఆత్మగౌరవంతో బతికినట్లేనా? అని ప్రశ్నించారు. . బీసీ ఆత్మగౌరవ భవనాలు ఏమయ్యాయి? అని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

 మేం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాండప్ బీసీ ప్రోగ్రాం అమలు చేస్తాం అని స్పష్టం చేసారు. ట్యాంక్ బండ్ పై బీసీ మహనీయుల విగ్రహాలు పెట్టిస్తాం అని హామీ ఇచ్చారు. నిరుపేదలను స్వయం సంవ్రుద్దులను చేయటమే మా పార్టీ లక్ష్యం అన్నారు ఆమె. బీసీలకు జనాభ ప్రకారం చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తేనే వారి అభివ్రుద్ది జరుగుతుంది అని కేసీఆర్ కు ఉపఎన్నికల ముందే పథకాలు గుర్తుకు వస్తాయి అని ఆరోపించారు. విద్య,వైద్యం వంటి వాటిని ఉచితంగా పేదలకు అందిస్తేనే మేలు జరుగుతుంది అన్నారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్,ఆరోగ్య శ్రీ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అట కెక్కించింది అని ఆరోపించారు. బీసీలను పాలకులు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts