తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎన్నికైన తర్వాత ఎంత దూకుడుగా ముందుకు సాగుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకు వెళుతూ ఎప్పటికప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అంతే కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నో సవాళ్లు విసురుతున్నారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. ముఖ్యంగా ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో  అధికార టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ అధినేత కేసీఆర్ కు వరుసగా సవాళ్ళు విసురుతూ ఉండడం గమనార్హం.



 ప్రస్తుతం హుజూరాబాద్ ప్రజలు కెసిఆర్ ను నమ్మే పరిస్థితిలో లేరని..  ప్రజల మనిషి గా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించిన ఈటల రాజేందర్ ను గెలిపించుకునేందుకు మరోసారి హుజురాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటూ ఇప్పటికే పలుమార్లు ప్రసంగాలు చేశారు బండి సంజయ్. అంతేకాదు హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ గెలిచి తీరుతాడు అంటూ అటు కెసిఆర్ కి సవాల్ సైతం విసిరారు.  అయితే ఇలా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కెసిఆర్కు వరుసగా సవాళ్ళు విసురుతూ ఉండటంపై కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 ప్రతి ఎన్నికకు ప్రతిపక్షాలు సవాల్ చేయడం సరికాదు.. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంటుంది.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం అంటూ కవిత చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీలు తమ సవాళ్లతో అటు రాజకీయాలను ఎటు వైపు తీసుకెళుతున్నాయో కూడా అర్థం కావడం లేదు అంటూ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు రాజకీయాల్లో సీఎం కేసీఆర్ గెలిచినన్ని సార్లు ఎవరూ కూడా గెలవలేదు అంటూ కవిత చెప్పుకొచ్చారు.  ఇటీవలే పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలిచారు కదా అయితే ఇక నరేంద్ర మోడీ రాజీనామా చేస్తారా.. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికను కూడా బీజేపీ సవాలుగా తీసుకుంది కదా అంటూ కవిత వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: