జాతీయ స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడుగులు ఏ విధంగా వేయబోతున్నారు ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ ఘన విజయం సాధించడం ఆమె పార్టీకి సంబంధించిన వ్యక్తులు ముగ్గురు కూడా ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేయడంతో ఇప్పుడు మమతా బెనర్జీ చాలా వరకూ వ్యూహాత్మకంగానే అడుగులు వేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రాజకీయంగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను భారతీయ జనతాపార్టీ ఇబ్బంది పెట్టడం అనేది సాధ్యం అయ్యేపని కాదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

 మమతా బెనర్జీ దాదాపుగా 60 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో పశ్చిమబెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఆమెను ఏ విధంగా కూడా అడ్డుకోవడం సాధ్యం అయ్యేపని కాదు అనే స్పష్టత కూడా వచ్చినట్టుగా అర్థమవుతుంది. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. మమతా బెనర్జీని కాదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అడుగులు వేసే అవకాశాలు దాదాపు అయితే లేవు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు చాలా వరకు కూడా బీజేపీ లోకి వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయనే కామెంట్లు వినపడుతున్నాయి.

 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన చాలామంది నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ఉప ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టకుండా ఆ తర్వాత ఇబ్బంది పెడతానని వ్యూహాలను సిద్ధం చేసుకుని పెట్టుకున్నారని అంటున్నారు. త్వరలోనే దాదాపుగా బిజెపి కి సంబంధించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఆమె తన పార్టీలోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చని టాక్ ఉంది. అవసరమైతే వాళ్లతో రాజీనామాలు చేయించి కాంగ్రెస్ నుంచి మళ్లీ గెలిపించుకునే విధంగా మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. మరి ఏం జరుగబోతోందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: