గుడివాడలో బలంగా ఉన్న మంత్రి కొడాలి నానికి చెక్ పెట్టడానికి ప్రతిపక్ష టి‌డి‌పి నానా ప్రయత్నాలు చేస్తుంది. మామూలుగా గుడివాడ అంటే టి‌డి‌పి కంచుకోట. అది 2009 వరకు మాత్రమే. అయితే ఎప్పుడైతే నాని వైసీపీలోకి వెళ్లారో అప్పటినుంచి పరిస్తితి మారిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ నుంచి నాని గెలిచేశారు. ఇప్పుడు మంత్రిగా సత్తా చాటుతున్నారు. ఇక్కడ టి‌డి‌పి ఎన్ని ప్రయత్నాలు చేసిన నానికి చెక్ పెట్టలేకపోయింది. అభ్యర్ధులని మార్చిన ఫలితం లేదు.

అయితే ఇప్పుడు నాని మంత్రిగా ఉండటంతో గుడివాడలో వైసీపీకి ఎదురు లేకుండాపోయింది. ఇక్కడ టి‌డి‌పి మరింత వీక్ అయింది. ఈ క్రమంలోనే పార్టీని మళ్ళీ గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు గుడివాడలో పర్యటించారు. మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో టి‌డి‌పి బలోపేతానికి సంబంధించి కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ క్రమంలోనే గుడివాడ వచ్చి కార్యకర్తలకు కొత్త ఊపు తెచ్చారు. కొడాలిపై తీవ్ర విమర్శలు చేశారు. నాని వల్ల గుడివాడకు ఒరిగిందేమీ లేదని, బూతులు మాట్లాడటం తప్ప నాని ఏమి చేయడం లేదని విమర్శించారు. అయితే కొడాలి మంత్రిగా ఎంత దూకుడుగా మాట్లాడతారో అందరికీ తెలుసు. కాకపోతే అదే దూకుడు గుడివాడని అభివృద్ధి చేయడం చూపించలేకపోయారని ప్రజల్లో కాస్త అసంతృప్తి ఉన్నట్లే కనిపిస్తోంది.

ఇప్పటివరకు నాని ఎమ్మెల్యేగా గెలిచిన అధికారంలో లేరు. దాంతో గుడివాడకు ఏం చేయలేకపోయారని అనుకున్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఏం చేయట్లేదనే భావన గుడివాడ ప్రజల్లో వస్తున్నట్లు కనిపిస్తోంది. అలా అని అక్కడ ప్రజలు నానికి వ్యతిరేకంగా లేరు. టి‌డి‌పి కూడా వీక్ గా ఉండటంతో గుడివాడ ప్రజలు నాని వైపే ఉన్నారు. అయితే కొడాలి నాని వైఫల్యాలని ఎత్తి చూపిస్తే టి‌డి‌పికి ఏమన్నా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.  ఇప్పుడు రామ్మోహన్ ఎఫెక్ట్‌తో గుడివాడలో టి‌డి‌పి శ్రేణులు పుంజుకుంటాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: