ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రా ల‌లో రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం ఇద్ద‌రు అన్నా చెల్లెల్లు పోరాటం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల‌లో చెరో పార్టీ పెట్టుకుని మ‌రీ వీరు ఫైట్ చేస్తున్నారు. వారిద్ద‌రూ ఎవ‌రో కాదు ఏపీ సీఎం వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ఆయ‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిల‌. అన్న ఏపీలో వైసీపీ అధినేత గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల‌లో బంప‌ర్ మెజార్టీ తో గెలిచి ప్ర‌స్తుతం ఏపీ సీఎంగా ఉన్నారు.

క‌ట్ చేస్తే అన్న గెలుపు కోసం ఏడెనిమి దేళ్లుగా ఎంతో క‌ష్ట‌ప‌డ్డ చెల్లి వైఎస్ ష‌ర్మిల ను అన్న ప‌ట్టించు కోలేద‌న్న ఆవేద‌నో లేదా మ‌రో కార‌ణ మో కాని ఆమె తెలంగాణ లో కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ష‌ర్మిల వై ఎస్సా ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు. అయితే అక్క‌డ అన్న .. ఇక్క‌డ చెల్లి కులాల‌ను టార్గెట్ గా చేసుకుని రాజ‌కీయం చేస్తోన్న ప‌రిస్థితే ఉంది.

అన్న ఏపీలో క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని బాగా టార్గెట్ చేస్తోన్న ప‌రిస్థితి ఉంది. జ‌గ‌న్ క‌మ్మ‌ల‌పై క‌సితో అణ గ దొక్కేస్తున్నార‌న్న విమ‌ర్శ లే ఎక్కువుగా వ‌స్తున్నాయి. ఆయ‌న ప్ర‌సంగాల్లోనూ ప‌దే ప‌దే క‌మ్మ కులం ప్ర‌స్తావ‌నే ఎక్కువుగా ఉంటోంది. అయితే చెల్లి ష‌ర్మిల తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక వ‌ర్గ మైన వెల‌మ‌ను టార్గెట్ గా చేసుకునే ఎక్కువుగా మాట్లాడుతున్నారు.

బీసీల‌ను కేసీఆర్ అణ‌గ దొక్కేస్తున్నాడంటూ విమ‌ర్శ‌లు చేసిన ష‌ర్మిల 0.5 జనాభా ఉన్న వెలమలకు ఒక సీఎం, మూడు మంత్రి పదవులా? అని ఆమె నిలదీశారు. అదే రాష్ట్ర జ‌నాభాలో 50 శాతం ఉన్న బీసీలకు కేవ‌లం మూడే పదవులు మాత్ర‌మే ఇచ్చారంటూ ఆమె మండి ప‌డ్డారు. ఏదేమైనా అన్న అక్క‌డ ఏపీలో క‌మ్మ‌ల‌ను టార్గెట్ గా చేసుకుని రాజ‌కీయం చేస్తుంటే.. చెల్లి ఇక్క‌డ అప్పుడే వెల‌మ‌ను టార్గెట్ గా చేసుకుని కౌంట‌ర్లు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: