ద‌ళిత బంధు ప‌థ‌కం కేవ‌లం హుజూరాబాద్‌కే ప‌రిమితం కాద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం అసెంబ్లీలో జ‌రిగిన‌ ద‌ళిత‌బంధు చ‌ర్చ‌లో ఆయ‌న మాట్లాడారు. ద‌ళిత బంధు ప‌థ‌కం ను ఏడాది కింద‌టే ఏర్పాటు చేయాల్సి ఉండే. కరోనా కార‌ణంగా ఏర్పాటు చేయ‌లేక‌పోయాం. క‌రోనా కార‌ణంగా రాష్ట్రంకు ల‌క్ష కోట్ల రూపాయ‌లు న‌ష్టం వ‌చ్చింద‌ని తెలిపారు. ద‌ళిత బంధు ప‌థ‌కం 119 నియోజ‌క వ‌ర్గాల్లో అమ‌లు చేస్తాం. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి తొలివిడుత‌గా 100 మంది చొప్పున ఎంపిక చేస్తాం. ద‌శ‌ల వారిగా ప్ర‌తీ ద‌ళితునికి అంద‌జేస్తాం అని వివ‌రించాడు. కొన్ని మండ‌లాల్లో తానే స్వ‌యంగా ప‌ర్య‌టించి ద‌ళిత బంధు ప‌థ‌కం ప‌ని తీరును ప‌రిశీలిస్తానని వెల్ల‌డించారు.
ద‌ళిత బంధు ఆచ‌ర‌నలో ఇబ్బందులు వ‌స్తే అధిగ‌మిస్తాం. కేవ‌లం హుజూరాబాద్ ఎన్నిక కోస‌మే ద‌ళిత బంధు ప‌థ‌కం కాద‌న్నారు. ఒక్క హుజూరాబాద్‌లోనే ఎన్నికలు ఉన్నాయా..? అని పేర్కొన్నాడు. సిద్దిపేట‌లో గ‌తంలోనే ప్ర‌క‌టించడం జ‌రిగింద‌ని తెలిపారు. ద‌ళిత బంధు ప‌థ‌కం విష‌యంలో చాలా మంది ద‌ళిత మేధావులు ముందుకు వ‌స్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఇది చాలా గొప్ప ప‌థ‌కం అన్నారు. ద‌ళిత బంధు వ‌ల్ల దాదాపు 75 శాతం ఇబ్బందులు లేవ‌న్నారు. ఈస్ట్‌మెన్ క‌ల‌లుండ‌వ‌చ్చ‌ని తెలిపారు. తెలంగాణ‌లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేది మేమే అని స్ప‌ష్టం చేశారు. ద‌ళిత బంధు నిధుల మీద స్వ‌యంగా వారికే పెత్త‌నం ఉంటుంది. వాట‌న్నింటిలో వీరికి రిజ‌ర్వేష‌న్ లు క‌ల్పిస్తాం. ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌గాహ‌న కలిగి ఉండాల‌ని సూచించారు.
 ద‌ళిత బంధులో మొద‌ట నిరుపేద‌ల‌కు అంద‌జేస్తాం అని తెలిపారు. ద‌ళిత బంధు విష‌యంలో ఎమ్మెల్యేలు అంద‌రూ బాధ్య‌త‌తో ప‌ని చేయాల‌ని సూచించారు. ద‌ళిత బంధు అంద‌రికీ వ‌ర్తిస్తుంది. రాజ‌కీయాల‌కు అతీతంగా ప‌ని చేయాల‌ని తెలిపారు. వీలు అయినంత వేగంగా సంపూర్ణంగా అంద‌రికీ వ‌ర్తింప‌జేస్తాం.  రాష్ట్ర ఆర్థిక ప్ర‌గ‌తిని దోహ‌దం చేయ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించారు.  తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ధ‌నిక రాష్ట్రమే.  ఇప్ప‌టి వ‌రకు 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు దాటుతుంది. రాబోయే ఏడేండ్ల‌లో 23 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెడుతుంద‌నిఇటీవ‌ల అంచెనా వేసిన‌ట్టు తెలిపారు. వ్య‌వ‌సాయాన్ని స్థిరీక‌రించాల‌ని కోరారు.  ప్ర‌తి ఒక్క‌రి అభివృద్ధికి కృషి చేస్తున్నాం. బీసీల కుల గ‌ణ‌న చేయాల‌ని అసెంబ్లీలో తీర్మానం చేద్దాం అని ప్ర‌క‌టించారు. అదేవిధంగా   బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్‌కు నిధులు కేటాయించాం.  దేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో త‌ప్ప మిగ‌తా రాష్ట్రాలన్ని జిల్లాల‌ను పెంచుకున్నాయి. జోన‌ల్ విధానం అమ‌లు అయితే కొత్త‌గా ఉద్యోగాలు పెరుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.   రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 1,31,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ప్రూప్‌ల‌తో స‌హా చూపిస్తాం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: