రాజకీయాల్లో సీనియర్ నేతలు ఎప్పుడు పదవులు కోసం పాకులాడుతారు. ఇప్పుడు కాకపోతే తర్వాత పదవులు పొందడం కష్టమైపోతుందని...సీనియర్లం కాబట్టి తమకు పదవులు ఇవ్వాలని కోరుకుంటారు. కానీ ఒకోసారి రాజకీయ పరిస్తితులని బట్టి సీనియర్లకు అనుకున్న మేర ఛాన్స్ రాదు. అయితే ఈ సారి నెల్లూరు జిల్లా రాజకీయాలకు సీనియర్లకు మంచి ఛాన్స్ దొరికేలా ఉంది.

నెల్లూరు అంటే వైసీపీకి కంచుకోట అనే సంగతి అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10 సీట్లు వైసీపీ కైవసం అయ్యాయి. అయితే ఇందులో పలువురు సీనియర్లు కూడా ఉన్నారు. దీంతో తమకు మంత్రులుగా ఛాన్స్ వస్తుందని కొందరు భావించారు. కానీ జగన్ జూనియర్ ఎమ్మెల్యేలు అయినా అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డిలని క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. అయితే ఈ సారి జరగబోయే మంత్రివర్గ విస్తరణలో జూనియర్లు సైడ్ అవ్వడం గ్యారెంటీ అని తెలుస్తోంది.


ఇదే క్రమంలో మంత్రి పదవులు దక్కించుకోవాలని సీనియర్లు ఆతృతగా ఉన్నారు. ముఖ్యంగా జిల్లాని లీడ్ చేస్తున్న రెడ్డి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు క్యాబినెట్‌లో ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్నారు. ఇక మంత్రి పదవి ఆశించే వారిలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కాకాని మొదట నుంచి పదవి ఆశిస్తున్నారు. కానీ మొదట కుదరలేదు...దీంతో ఈ సారి ఎలాగైనా క్యాబినెట్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నారు.


ఇక కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సైతం మంత్రి కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. అనేక పర్యాయాలు కోవూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న...ఈసారి ఎలాగైనా జగన్ క్యాబినెట్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాలో మోస్ట్ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాం నారాయణరెడ్డి సైతం మంత్రి పదవి మరొకసారి దక్కకపోతుందా అని చూస్తున్నారు. ఇటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: