తెలంగాణాలో ఉపఎన్నికల వేళ అధికార పార్టీ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన ఉద్యోగాల భర్తీ అతితక్కువగా ఉండటంతో నిరుద్యోగులలో తీవ్ర అసంతృప్తి ఉంది. దీనిని ఏ పార్టీ పెద్దగా వాడుకోలేకపోయింది. ఆయా పార్టీలు ఈ సమస్యపై తీవ్రంగా అధికార పార్టీని తీవ్రంగా విమర్శించాయి తప్ప మరేమి చేయలేకపోయాయి. అయితే అందుకు విపక్షాలకు తోడుగా ఆయా నిరుద్యోగులు ఉండాలి, కానీ వాళ్ళు ఆపని చేస్తే భవిష్యత్తులో వాళ్లపై కేసు లు ఉన్నాయని కాళ్ళదాకా వచ్చిన ఉద్యోగాన్ని కూడా అందుకోనివ్వరు.

ఈ నేపథ్యంలోనే ఒకవేళ కొందరు దైర్యం చేసి ముందుకు వచ్చినప్పటికీ ఆయా పార్టీలు వాళ్ళని వాడుకుని వదిలేస్తే పరిస్థితి ఏమిటి అనేది కూడా వాళ్ళు ఆలోచించారు. నిజమే ఇవాళరేపు పార్టీలు అన్ని వాడుకునేవే తప్ప ఎవరు ప్రజలు కోసం ఆలోచించేవారు లేరు. అయితే కొంతలో కొంత తెరాస మేలు అనుకోవాలి అనే ఆలోచన ఆయా వర్గాలలో వచ్చి ఉండవచ్చు. ఇక ఎప్పుడైనా ప్రభుత్వ నియామకాలు జరిగినా అవన్నీ కేవలం తాత్కాలిక ప్రాతిపదికన లేక అవుట్ సోర్సింగ్ ద్వారా చేస్తున్నారు. దీని ద్వారా నిర్వహణ ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వం ఆలోచన. కానీ ఈ ఉద్యోగులకు సరిగ్గా జీతాలు వస్తున్నది లేనిది కూడా తెలియదు. ఈ విధంగా తెలంగాణాలో నిరుద్యోగుల పరిస్థితి ఉంది.

ఈ పరిస్థితులలో విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న వీసీ పోస్టులను కూడా అలాగే వదిలేశారు. ఇటీవల కోర్టు కలిగించుకోవడంతో ఈ నియామకాలు జరిపారు. అవికూడా లోపాలతో జరిగినట్టు తెలుస్తుంది, అంటే ఒక్కో వీసీ పోస్టుకు రెండు కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది అని వైఎస్ ఆర్సీపీ తెలంగాణ అధినేత షర్మిల అన్నారు. ఒక మంత్రి స్వయంగా అసెంబ్లీ లో ప్రభుత్వ ఉద్యోగాలు 4-5 శాతం మాత్రమే ఇవ్వగలం అనడం ఎంతవరకు సమంజసం అన్నారు ఆమె. అలాగే కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలను సోమరిపోతులు అనడం సరికాదని ఆమె అన్నారు. అలాగే హుజురాబాద్ ఉపఎన్నికల కోసం నామినేషన్ వేసేందుకు వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్స్  ను ఖైదు చేయించడం దారుణం అన్నారు ఆమె.  

మరింత సమాచారం తెలుసుకోండి: