తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన లక్ష్యంగా చేసుకుని విపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తూ మీడియా లో హడావుడి చేస్తాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పరిపాలన విషయంలో పాటల రూపంలో కూడా ప్రజల్లోకి వ్యతిరేకతను తీసుకువెళ్ళాలి అని విపక్షాలు కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ ప్రారంభం అయిన తరువాత ఇదే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ పరిపాలనను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ సంస్కృతి ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు.

ఇప్పుడు బతుకమ్మ పండుగను వైయస్ షర్మిల పూర్తిగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని పాటలను వైరల్ చేస్తోంది వైఎస్ షర్మిల పార్టీ. బతుకమ్మ పాట రూపంలో సీఎం కేసీఆర్ సచివాలయానికి రాకపోవడం ప్రగతి భవన్ కు మాత్రమే పరిమితం కావడం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వంటి అంశాలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ కొన్ని పాటలను బతుకమ్మ ఆడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. సీఎం కెసిఆర్ పరిపాలనలో లక్ష్యంగా చేసుకుని అదే విధంగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను లక్ష్యంగా చేసుకుని ఈ పాటను రూపొందించారు.

ఈ పాటలో గత ఏడేళ్ల నుంచి జరుగుతున్న వ్యవహారాలను దానికి కోలాటం ఆడుతున్నారు. దీనిని వైయస్ షర్మిల పార్టీ విస్తృతంగా వైరల్ చేస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పాటలను గట్టిగానే వాడుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పాటలను వైరల్ చేయడం ద్వారా సీఎం కేసీఆర్ విధానాలను మరింత బలంగా ఎదుర్కొనే విధంగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పాటలు టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి అనేది కూడా పాటలు వింటే స్పష్టంగా అర్థమవుతుంది. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వీటికి మంచి స్పందన వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts