పశ్చిమ బెంగాల్ లో బీజేపీ పాగావేయాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ దిది దానిని సాగనివ్వలేదు. తాజా ఉపఎన్నికలో కూడా దిది గెలిచి తన కు ఉన్న గండాన్ని కూడా దాటేసింది. దీనితో ఒకప్పుడు దిది సైన్యంగా ఉన్న వాళ్ళు ఆమె పై బీజేపీ చేస్తున్న రాజకీయాలతో వేరే పార్టీలలోకి వెళ్లారు. ఇప్పుడు వాళ్ళు అందరూ మళ్ళీ దిది సైన్యంలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ కుటిల రాజకీయాలు బయటపడ్డాయి. అందుకు సాక్ష్యంగా త్రిపురలో తమ ఎమ్మెల్యే నే ఆ పార్టీని విమర్శించడం చూశాం. అంటే అక్కడ ఏ స్థాయికి దిది ని నిలువరించడానికి ప్రయత్నాలు చేయబడ్డాయి అనేది అర్ధం చేసుకోవచ్చు. ఒక్కసారి అయితే ఏమోలే అనుకోవచ్చు, కర్ణాటక నుండి పశ్చిమ బెంగాల్ వరకు బీజేపీ నీచరాజకీయాలు, అధికారం కోసం వాళ్ళు చేస్తున్న దాష్టికాలు అన్ని ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు.

అందుకే బీజేపీ నుండి ఆయా రాష్ట్రాలలో అనేక వలసలు జరుగుతున్నాయి. గతంలో టీఎంసీ నుండి  బయటకు వెళ్లిన మాజీ బీదన్నగర్ మేయర్ సబ్యసాచి దత్తా కూడా ఇప్పుడు బీజేపీని విడుతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే టీఎంసీ ముఖ్యనేతలతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. దీనితో ఆయన మళ్ళీ టీఎంసీ కి వెళ్ళడానికి కార్యాచరణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈయన 2019లో దుర్గా పూజకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు కూడా దుర్గా పూజకు ముందే టీఎంసీ లో చేరబోతున్నట్టు తెలుస్తుంది. అయితే అప్పట్లో బీదన్నగర్ ఎన్నిక సమయంలో ప్రత్యర్థి గురించి, రాష్ట్ర మంత్రి సుజిత్ బోస్ మరియు రాజా అర్హత్ న్యూ టౌన్ ఎమ్మెల్యే తపస్ ఛటర్జీ విషయంలో దత్తా కు వచ్చిన బేదాభిప్రాయాలు ఆయన పార్టీ వీడడానికి కారణంగా చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో అంతరపార్టీ బేదాభిప్రాయాలు బయటకు రాకుండా దత్తాను పార్టీలో కి ఆహ్వానించాలని టీఎంసీ అధినాయకత్వం తెలిపినట్టు తెలుస్తుంది. గత ఎన్నికలలో  పరాజయం పాలైన దత్తా మళ్ళీ టీఎంసీ కి వెళ్లడం పట్ల రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. టీఎంసీ తరుపున ఈసారి కూడా దుర్గా పూజ ఘనంగా జరుపనున్నారు. అప్పుడే ఈ చేరిక ఉండవచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: