క‌రీంన‌గ‌ర్ ఎంపీ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ 36 రోజుల పాటు ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరు తో పాద‌యాత్ర నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ పాద‌యాత్ర తో బీజేపీ కి చాలా ఉప‌యోగ ప‌డుతుంద‌ని బీజేపీ అభిమానులు అంటున్నారు. ఈ పాద‌యాత్ర ఇంత విజ‌య వంతం అయిందంటే దానికి కార‌ణం టీఆర్ఎస్ ప్ర‌భుత్వ మే అని బీజేపీ నాయ‌కులు అంటున్నారు. ఈ ప్ర‌భుత్వం పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంది కాబట్టే త‌మ యాత్ర కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌ట్టారు. ల‌క్షాలాది మంది మ‌నుసుల‌ను గెలుస్తు త‌మ పాద‌యాత్ర సాగింది. బీజేపీ నాయ‌కుల వాద‌న. నిజానికి బండి సంజెయ్ పాద‌యాత్ర కు ప్ర‌జా ల నుంచి మంచి స్పంద‌న‌నే వ‌చ్చింది. ఫీల్డ్ అసిస్టెంట్లు, మ‌హిళ‌లు , నిరుద్యోగులు, రైతులు, పోడు భూములు సాగు చేసు రైతులు పాద‌యాత్ర ద్వారా బండి సంజయ్ ను క‌లిసారు. వారి స‌మ‌స్య‌లు కూడా బండి కి విన్న వించారు.



అయితే బండి సంజయ్ పాద‌యాత్ర పై అధికార పార్టీ నాయ‌కులు కూడా సెట‌ర్లు పెల్చారు. ప్ర‌జా సంగ్రామ యాత్ర అస‌లు దేని కోసం.. దీని ల‌క్ష్యం ఏంట‌ని అధికార పార్టీ నాయకులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురుపించారు. అలాగే మంత్రి కేటీఆర్ కూడా బండి సంజయ్ పై విమ‌ర్శలు చేశారు. బండి సంజెయ్ త‌మ ప్ర‌భుత్వం త‌ర‌పున అంబ‌సిడ‌ర్ అని వ్యాఖ్య నించారు. అయితే బండి సంజ‌య్ పాద‌యాత్ర బాగానే సాగిన చివ‌ర్ల‌లో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి దూకుడు పెంచ‌డంతో పాద‌యాత్ర కు కాస్త ప్ర‌జా ద‌ర‌ణ త‌గ్గింది. కొన్ని గ్రామ ల్లో నిర్వ‌హించిన స‌భ‌లో కేవ‌లం బీజేపీ నాయకులు మాత్ర‌మే హాజరు అయ్యారు. సాధ‌ర‌ణ ప్ర‌జ‌లు చాలా స‌భ‌ల‌కు దూరంగానే ఉన్నారు. కానీ బండి సంజ‌య్ మొద‌టి ప్ర‌యోగం మాత్రం స‌క్స‌స్ అయిన‌ట్టే అని చెప్పాలి. బండి పాద‌యాత్ర తో టీఆర్ ఎస్ నాయ‌క‌త్వం కాస్త క‌ద‌లిక లు వ‌చ్చిన మాట వాస్త‌వ‌మ‌ని చెప్పాలి. చివ‌రిగా బండి యాత్ర వ‌ల్ల బీజేపీ కి క్యాడ‌ర్ ప‌రంగా అధికార పార్టీ కి వ‌ణ‌కు ప‌ట్టించిన విష‌యంలో కొద్ది పాటి మార్కులు ప‌డిన‌ట్టే అని చెప్పాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: