ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనా ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది అని ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. చిన్న చిన్న అంశాలు పరిష్కరించలేదనే అంశం నడుస్తోంది అని అన్నారు ఆయన. విలీనానంతరం ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తున్నాం అని ఈ సందర్భంగా తెలిపారు. 1-1-20 తర్వాత చని పోయిన కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలకు ఆదేశాలిచ్చాం అని ఆయన గుర్తు చేసారు. ఆర్టీసీ సిబ్బందికి 20-21 ఏడాదికి సంబంధించి లీవ్ ఎన్ క్యాష్ మెంట్ ఇస్తున్నామని ఎండీ అన్నారు.

సిబ్బంది కుటుంబాలకు ఈహెచ్ ఎస్ కార్డులు జారీ పూర్తైంది అని ఆయన తెలిపారు. ఆదాయార్జన కోసం కార్గో సహా  ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. డీజిల్ ధరలు పెరుగుదల వల్ల సంస్థపై భారం పడపతోంది అని ఆయన చెప్పుకొచ్చారు.  సంస్థలో నిర్వహణ వ్యయం తగ్గించేందుకు వంద ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో ప్రవేశపెడతాం అని అన్నారు. సిబ్బంది సంక్షేమం, సంస్థ ఆదాయం పెంపు,నిర్వహణ వ్యయం తగ్గింపు అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాం  అని ఆయన వెల్లడించారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాం  అని ఆయన వ్యాఖ్యానించారు. దసరా రద్దీ దృష్ట్యా 4 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం అని అన్నారు.  ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి అని తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు అమలు చేస్తాం అని అన్నారు. ఒక వైపు మాత్రమే రద్దీ ఉంటోన్న కారణంగా నష్టం రాకుండా ఉండేందుకు అదనపు చార్జీలు వసూలు చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాం అని అన్నారు.  రెగ్యులర్ బస్సు సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు అని పేర్కొన్నారు. దూరప్రాంత బస్సుల్లో డ్రైవర్  ఫోన్ చేసే సదుపాయం తొలగించాం అని చెప్పుకొచ్చారు. బస్సు ప్రమాదాల నివారణ కోసమే ఈ నిర్ణయం అమలు చేస్తున్నాం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap