కొత్త మంత్రులు ఎవరూ... ఎవరికి అవకాశం ఉంటుంది... ఎవరి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతల్లో ఇదే ఆలోచన. ఏ జిల్లాలో ఏ మంత్రి ఉంటారు... ఆయన స్థానంలో ఏ నేతను అమాత్య పదవి వరిస్తుందనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా కనిపిస్తోంది. తొలి మంత్రివర్గ సమయంలో సామాజిక సమీకరణలకు పెద్ద పీట వేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఈసారి కూడా అదే విధానాన్ని పాటిస్తారని అంతా భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రస్తుతం ప్రాతనిధ్యం వహిస్తున్న సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్‌ల తొలగింపు దాదాపు ఖరారైపోయింది. వీరి స్థానంలో ప్రస్తుత శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాద్, విశ్వసరాయి కళావతిలకు అవకాశం ఉండనుంది. ఇక విజయనగరం జిల్లా నుంచి రాజన్నదొర, కొలగట్ల వీర భద్రస్వామి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక పరిపాలన రాజధానిగా ఎంపిక చేసిన విశాఖ జిల్లా నుంచి గుడివాడ అమర్నాథ్, ముత్యాల నాయుడు రేసులో ఉన్నారు.

ఈసారి తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురికి అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం కోటా కింద... దాడిశెట్టి రాజా, బీసీ వర్గానికి చెందిన పొన్నాడ సతీష్, కొండేటి చిట్టిబాబు పేర్లు జిల్లాలో వినిపిస్తున్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరోసారి క్షత్రియులకు అవకాశం కల్పించనున్నారు. మంత్రి శ్రీరంగనాథరాజు స్థానంలో... ప్రసాద రాజుకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనిపాస్‌తో పాటు పోలవరం ఎమ్మెల్యే తెర్లం బాలరాజు పేరు కూడా వినిపిస్తోంది. కృష్ణా జిల్లా నుంచి పార్థసారధి పేరు ఇప్పటికే ఖరారైంది. మిగిలిన రెండు స్థానాలకు గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్‌తో పాటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్, పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రకాశం జిల్లా నుంచి అన్నా రాంబాబు, మహీధర్ రెడ్డి, సుధాకర్ బాబు పేర్లు రేసులలో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డిల్లో ఒకరికి మాత్రం తప్పకుండా ఛాన్స్ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: