ఒక్కొక్కసారి రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయంటే తమ గొయ్యి తామే తవ్వుకున్నట్టుగా ఉంటాయి. ముఖ్యంగా హుజురాబాద్ లో  ఒక నాటి కాంగ్రెస్ అభ్యర్థి నేడు టిఆర్ఎస్ పార్టీలో  త్రిశంకు స్వర్గంలో తలకిందులుగా వేలాడుతున్న కౌశిక్ రెడ్డి. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందంటే నాగరుకా  నాగట్క అన్నట్టు మారిందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హుజురాబాద్ లో ఎన్నికలయ్యాక కౌశిక్ రెడ్డికి ప్రగతి భవన్ తలుపులు  తెరుచుకుంటాయా, లేదా అనే  ఆరోపణలు వినిపిస్తున్నాయి.  హుజురాబాద్ రాజకీయం చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షాత్తు రంగప్రవేశం చేయడంతో దాని ఉనికే మారిపోయింది. ముఖ్యంగా ఈటల రాజేందర్ ని ఎలాగైనా ఓడ కొట్టాలనే దృఢ సంకల్పంతో  2018 ఎన్నికల్లో 60 వేల ఓట్లతో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ని నెమ్మదిగా  టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చారు. నిజంగా ఆ రోజున కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్  లోకి వెళ్లకుండా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరు కాబట్టి రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నా, లేకపోయినా కౌశిక్ రెడ్డే అభ్యర్థి అయ్యేవాడు.

ఆల్రెడీ తనకున్న 60 వేల ఓట్లతో రేవంత్ రెడ్డి మేనియా కొంచెం పని చేస్తే జీహెచ్ఎంసీలో లింగోజిగూడ లో కార్పొరేటర్ గా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి  తరహాలో గెలిచే అవకాశాలు ఉండేవి. టిఆర్ఎస్ కెసిఆర్, బిజెపి ఈటెల రాజేందర్ కొట్టుకుంటున్నారు. ప్రజలకు ఒళ్ళు మండి నిజంగానే కాంగ్రెస్ లో కౌశిక్ రెడ్డి ఉండుంటే తననే గెలిపిస్తురనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఓడిన కాంగ్రెస్ అభ్యర్థిగా హుజురాబాద్ లో ఉండేవాడు. 2023 లో మళ్లీ తనకే ఎమ్మెల్యే సీట్ వచ్చేది.

ఇప్పుడు ఏమైందంటే టిఆర్ఎస్ పార్టీలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ పీఠం వేసేసారు. గెలిచినా ఓడినా తర్వాత తనదే సీటు. బిజెపిలో ఈటెల ఉండిపోయాడు. 2023 లో కూడా తనదే సీటు. ఇప్పుడు అటూ ఇటూ కాకుండా అయిపోయాడు కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ లో ఉండే ఎమ్మెల్యే సీటు ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ అవుతాడో లేదో తెలియదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఈటెల రాజేందర్ గెలిస్తే కెసిఆర్ ముందు చేసే పని కౌశిక్ రెడ్డి ని నువ్వుండి నాకు ఉపయోగం ఏంటి అని ప్రగతిభవన్ తలుపులు మూసేసినా ఆశ్చర్యం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: