ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రోజు రోజుకు తారాస్దాయికి చేరుకుంటుంది. చిత్తూరు జిల్లా.....టి‌డి‌పి అధినేత చంద్రబాబు జిల్లా..పేరుకు మాత్రమే చంద్రబాబు సొంత జిల్లా గానీ...ఇక్కడ ఆధిక్యం మొత్తం వైసీపీదే. 2014 ఎన్నికల ముందు వరకు జిల్లాల్లో కొంతవరకు టి‌డి‌పి ప్రభావం ఉండేది...కానీ నిదానంగా జిల్లాలో టి‌డి‌పి ఆధిక్యం తగ్గిపోతూ వచ్చింది. రాష్ట్రంలో టి‌డి‌పి గాలి ఉన్నా సరే 2014 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీనే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 8, టి‌డి‌పి 6 సీట్లు గెలుచుకుంది.

2019 ఎన్నికలోచ్చేసరికి వైసీపీ 13, టి‌డి‌పి 1 గెలుచుకుంది....అంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. టి‌డి‌పి గెలిచిన ఆ ఒకటి కూడా కుప్పం. అయితే ఆ కుప్పం నియోజకవర్గాన్ని కూడా వైసీపీ వశం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలిసిందే. అయితే ఇలా చిత్తూరు జిల్లా వైసీపీ వశం కావడానికి ప్రధాన కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పొచ్చు. జిల్లాపై పెద్దిరెడ్డికి పూర్తి పట్టు ఉంది.

ఆయన బట్టే జిల్లాలో వైసీపీ అభ్యర్ధులు నిలబడుతారు. గత ఎన్నికల్లో ఈయన మద్ధతుదారులు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిలబడి వైసీపీ తరుపున గెలిచారు. అంటే జిల్లాపై పెద్దిరెడ్డికి ఎంత పట్టు ఉందో అర్ధమవుతుంది. ఇంకా చెప్పాలంటే జిల్లాలో జగన్ ఇమేజ్ కంటే పెద్దిరెడ్డి ఇమేజ్ ఎక్కువ పనిచేస్తుంది. పైగా అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి బలం మరింత పెరిగింది. ఆఖరికి కుప్పం కూడా వైసీపీ ఖాతాలో వేయాలని చూస్తున్నారు.

కాబట్టి చంద్రబాబు...ముందు పెద్దిరెడ్డిని టార్గెట్ చేసి నిలువరించకపోతే...భవిష్యత్‌లో చిత్తూరులో టి‌డి‌పికి చాలా ఇబ్బందులు వస్తాయి. ఆయన రాజకీయాలకు ధీటుగా వ్యూహాలు వేసి టి‌డి‌పిని నిలబెట్టాలి. ఇప్పటినుంచి ఆ ప్రయత్నాలు చేస్తే...కనీసం ఎన్నికల నాటికి టి‌డి‌పి కాస్త నిలబడుతుంది. అలాగే జిల్లాలో సగం సీట్లు అయిన గెలుచుకోవచ్చు. అలా కాకుండా లైట్ తీసుకుంటే చిత్తూరులో టి‌డి‌పి ఉనికికే ప్రమాదం. 

మరింత సమాచారం తెలుసుకోండి: