ఏపీలో అధికార వైసీపీలో మళ్లీ పదవుల కోలాహలం ప్రారంభం కానుంది. దసరా తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తారని వార్తలు వస్తున్నాయి. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ నూటికి నూరు శాతం మంత్రులను మార్చే వేస్తారని... తన పదవి కూడా ఉండ‌దని చెప్పడంతో సీనియర్ నేత‌ల‌తో పాటు మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్న నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఖాళీగా ఉన్న 14 ఎమ్మెల్సీలను కూడా భర్తీ చేయాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే విడుదల చేయనుంది. స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీలు... ఎమ్మెల్యేల కోటాలో మరో మూడు ఎమ్మెల్సీలు భర్తీ కానున్నాయి. స్థానిక సంస్థలలోనూ  ఇటు అసెంబ్లీలో అధికార వైసిపికి తిరుగులేని బ‌లం ఉన్న నేపథ్యంలో ఈ 14 సీట్లు అధికార పార్టీ ఖాతాలోనే పడనున్నాయి.

ఏపీ మండ‌లిలో మొత్తం 58 స్థానాలు ఉన్నాయి. వైసీపీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతోన్న స‌మాచారాన్ని బ‌ట్టి చూస్తే ఈ సారి క‌మ్మ , కాపు కోటాలో ఇద్ద‌రు నేత‌ల‌కు ఎమ్మెల్సీ గ్యారెంటీ అంటున్నారు. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కు జ‌గ‌నే స్వ‌యంగా ఎమ్మెల్సీ, మంత్రి ప‌ద‌విపై హామీ ఇచ్చారు. దీంతో మ‌ర్రికి ఈ సారి ఎమ్మెల్సీ ప‌క్కా అంటున్నారు. ఇక  చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కు కాపు కోటాలో ఎమ్మెల్సీ ఖాయ‌మైన‌ట్టే ?  చీరాల‌లో టీడీపీ నుంచి గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రాంను పార్టీలో చేర్చు కోవ‌డంతో ఆమంచికి ప్రాధాన్య‌త త‌గ్గిన‌ట్టు ఉండ‌కూడ‌ద‌నే ఆయ‌న్ను ఎమ్మెల్సీ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో చూస్తున్నారు.

ఇక బీసీ యాద‌వ కోటాలో కూడా టీడీపీ నుంచి వైసీపీ లోకి వ‌చ్చిన బీద మ‌స్తాన్‌రావు కు ప‌ద‌వి ఖాయ‌మైంది. ఆయ‌న‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి మ‌ద్ద‌తు ఉందంటున్నారు. చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన కుప్పం వైసీపీ ఇన్‌చార్జ్ భ‌ర‌త్‌కు కూడా ఎమ్మెల్సీ ఖాయం అంటున్నారు. కుప్పంలో చంద్ర‌బాబును బాగా టార్గెట్ చేసేందుకే ఆయ‌న‌కు ప‌ద‌వి ఇస్తారంటున్నారు. ఇక చిత్తూరు జిల్లా లో మ‌రో రెడ్డి నేత‌కు ప‌ద‌వి ఖాయ‌మైందంటున్నారు. ఇక సీనియ‌ర్ నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లును మ‌రోసారి మండ‌లికి పంపుతార‌ని టాక్ ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: