ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు డ్రగ్స్ తో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. రాజకీయంగా కూడా ఇది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంచలనం అయింది. విపక్షాలు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. గుజరాత్ లో దొరికిన డ్రగ్స్ కి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా గట్టిగా ఫోకస్ చేసాయి. గుజరాత్ ముంద్రా పోర్ట్ డ్రగ్స్ కేసులో నిందితులుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన దంపతులు ఉన్నారు ఇప్పుడు. డి ఆర్ ఐ నమోదు చేసిన కేస్ ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్ ఐ ఏ... పలు కీలక సాక్ష్యాలను సేకరిస్తుంది.

21 వేల కోట్ల విలువైన హెరయిన్ ను తరలిస్తున్న కేస్ లో నిన్న కేస్ నమోదు చేసిన ఎన్ ఐ ఎ... ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాచవరం సుధాకర్ , పూర్ణిమ వైశాలి అనే దంపతులను నిందితులుగా చేర్చింది. వీరిద్దరితో పాటు కోయంబత్తూర్ కు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎన్ ఐ ఎ... అతని వద్ద నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది. విదేశాల నుండి డ్రగ్స్ అక్రమ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ కోణం లో ఎన్ ఐ ఎ విచారణ చేస్తుంది.

ఈ కేసులో ఉగ్ర మూలాలపై దృష్టి సారించింది ఎన్ ఐ ఎ. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాచారం సుధాకర్ ను ఈ కేసులో కీలకంగా భావిస్తున్నారు. గత ఏడాది తన భార్య వైశాలి పేరు మీద ఆశి ట్రేడింగ్ కంపెనీ స్థాపించాడు. విజయవాడ సత్యనారాయణ పురం లో ని వైశాలి పుట్టింటి చిరునామా తో  కంపెనీ అడ్రస్ పెట్టాడు. కంపెనీ సి ఈ సి ను డ్రగ్స్ మాఫియా కు ఇవ్వడం తోనే డ్రగ్స్ దిగుమతి అయ్యినట్టు సుధాకర్ పై అభియోగాలు మోపారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: