ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెల్సిందే. నేటితో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రోజుల ఆరవ రోజుకు చేరింది. అయితే.. ఈ ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ముందుకు పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ శాసన సభ, మండలి ఉభయ సభల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలనూ చేపట్టనున్నారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.
ఆరవ రోజు సమావేశాల్లో అసెంబ్లీలో చర్చకు వచ్చే ప్రశ్నలు : చేపల పెంపకానికి ప్రొత్సాహం, దారిద్ర్య రేఖ దిగువన గల కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు, పట్టణ మిషన్ భగీరథ పథకం కింద తాగునీరు లాంటి అంశాలతో పాటు  కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులు, తెలంగాణ ఆర్టీసీ సరుకు రవాణా మరియు కొరియర్ సేవలు, మరియు ఇళ్ల స్థలాల క్రమ బద్ధీకరణ పై ఇవాళ అసెంబ్లీ లో చర్చ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

శాసనమండలిలో చర్చకు వచ్చే ప్రశ్నలు : విశ్రాంత ఆచార్యులకు సవరించిన యుసి వేతన స్కేల్,  ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, సేంద్రియ వ్యవసాయం, సోషల్ మీడియా మరియు యూట్యూబ్ లో పోస్టులు,  న్యాయస్థానాలకు సొంత భవనాలు, కల్వకుర్తి మండలం రామగిరి ఆలయ అభివృద్ధి లాంటి అంశాలు ఇవాళ చర్చకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శాసన మండలి లో ఆ రోజు కేవలం ప్రశ్నోత్తరాల సమయం మాత్రమే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.  అలాగే శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్వల్పకాలిక చర్చలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పై చర్చించనున్నారు. అంతేకా... ద ఇండియన్ స్టాంపు బిల్ 2021 కి  (తెలంగాణ  సవరణ) బిల్లును.. సీఎం కేసీఆర్ ప్రవేశపె ట్టి.. చర్చించి  ఆమోదానికి  పెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: