ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో టీడీపీ నేతలు నాలుగేళ్ల నుంచి సీరియస్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత మోడీ ని పెద్దగా చంద్రబాబు నాయుడు విమర్శించిన పరిస్థితి లేదని చెప్పాలి. రాజకీయంగా దీనిపై చంద్రబాబు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ఇది పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు అలాగే ప్రతీ ఒక్కరు మోడీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత అశోక గజపతి రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదిన వేడుకల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు.

హాజరైన కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు  మాట్లాడుతూ... గ్యాస్ ధరలను అదుపులో పెట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే  అని స్పష్టం చేసారు. ధరల మంటతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు వైషమ్యాలు లేకుండా పనిచేయాలి అని సూచనలు చేసారు. రాష్ట్రంలో అసలు తెలుగు భాష లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి  అని ఆయన ఆరోపించారు. ప్రపంచమంతా తల్లి భాషలోనే విద్య కొనసాగుతోంది  అని అన్నారు అశోక్.

కానీ, ఏపీ లో ఆ పరిస్థితి కనిపించడం లేదు  అని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు అమలు చేయలేదు కాబట్టే అప్పట్లో తాను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసాను  అని అన్నారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ..కొన్ని విషయాల్లో స్ఫూర్తిగా నిలిచారు అని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రజా సౌకర్యాలను తాకట్టు పెడుతోంది  అని ఆరోపించారు. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు అని అన్నారు. స్కూల్, ఆస్పత్రులాంటి ప్రజా సౌకర్యాలను తాకట్టు పెట్టె ప్రభుత్వం... జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాలను తాకట్టు పెట్టగలరా..?అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: