దేశాన్ని దాదాపు 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ, ప్ర‌స్తుతం కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ ల వైఖ‌రి రాష్ట్రాల‌పై ఒకే విధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. రాష్ట్రాల‌ను త‌మ గుప్పెట్లో పెట్టుకోవ‌డానికి ఈ రెండు జాతీయ పార్టీలు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటాయని విశ్లేష‌కులు చెబుతున్నారు. రాష్ట్రాల హ‌క్కులు, అంత‌ర్గ‌త విష‌యాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవ‌డం పై గ‌తంలో అనేక సంద‌ర్బాల్లో రాష్ట్రాలు అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశాయి. తాజాగా సీఎం కేసీఆర్ కూడా కాంగ్రెస్‌-బీజేపీల కేంద్ర ప్ర‌భుత్వం పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.



     తెలంగాణ అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ జరుగుతున్న సందర్భంలో సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.. రాష్ట్రాల హక్కులను హరించడంలో కాంగ్రెస్‌, బీజేపీ లు దొందు దొందే అని అన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రిగా..ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ మాట చెబుతున్నానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయే నిధులు ఎక్కువ.. అక్కడి నుంచి వచ్చేవి తక్కువని వివ‌రించారు. రాష్ట్రాల హక్కులు కాపాడుకోవ‌డానికి కేంద్రం ప్ర‌భుత్వంతో పోరాటం చేస్తామని ప్ర‌క‌టించారు.



 ఈ విషయమై తమిళనాడు  ముఖ్య‌మంత్రి స్టాలిన్ తనకు లేఖ రాసిన విషయాన్ని చెప్పారు.  ఇందిరాగాంధీ హ‌యాం నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాక్కుంటున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రాల హక్కుల కోసం పోరాడాల్సి వస్తే కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తామని ఈ సంద‌ర్భంగా తెలిపారు.


    తెలంగాణ గ్రామాల‌ను ప్లాన్ యువర్ విలేజ్ పేరుతో అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు.  గ్రామ పంచాయతీల‌ను మున్సిపాలిటీలో చేర్చేందుకు ‘మన దగ్గర ఒప్పుకోరు- కోర్టుకు వెళ్తారు’ అని చెప్పారు.  పల్లె - పట్టణ ప్రగతి ప్రోగ్రాం ద్వారా 2 లక్షల 33వేల పోల్స్ ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి ఓ పంచాయితీ సెక్రటరీని నియ‌మించిన‌ట్టు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: