ఇక మత్స్యకారులకూ క్రెడిట్ కార్డులు  

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజేపి) మత్స్యకారులకు తాజాగా శుభవార్త చెప్పింది. రైతులకు ప్రస్తుతం అందజేస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డుల తరహాలోనో చేపలు పట్టుకుని జీవనం సాగీంచే మత్య్యకారులకూ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని సంకల్పించింది. ఈ విషయాన్ని కేంద్ర మత్స్య శాఖ మంత్రి మురుగన్ స్వయంగా ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 217 కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీరప్రాంతంలో చేపడుతున్న నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆంధ్ర ప్రదేశ్ లో పరపాలన చేస్తున్న వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజా వ్యతిరేగంగా ఉన్నాయని , ముఖ్యంంగా 217 జీవో చేపలు పట్టుకుని జీవనం సాగించే వారికి పొట్టకొట్టే లా ఉందని ఆరోపించారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ పదవీ చేపట్టిన తరువాత ఎన్నో వెనుకబడిన తరగతుల వారికి మెలు చేకూరిందని తెలిపారు. మత్స్యకారలను గుర్తించిన పార్టీ బి.జె.పి  మాత్రమే నని తెలిపారు. భారతీయ జనతా పార్టీ హయాంలోనే కేంద్రంలో మత్స్యకారుల అభివృద్ధి కోసం ఏకంగా ఓక మంత్రిత్వ శాఖ ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరీ మత్స్యకారుల మధ్య ఏర్పడుతున్న తగాదాలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్- తమిళనాడు మధ్య నున్న ప్రళయకావేరి (పులికాట్) సరస్సు ముఖద్వారాల పూడిక తీతకు నిధులు సమకూరుస్తానని వాగ్దానం చేశారు. కేంద్రంలో ఓబిసి వ్యక్తి ని ప్రధాన మంత్రిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదని, ఆంధ్ర ప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ ఐనా వెనుకబడిన తరగతుల వారిని కనీసం ముఖ్యమంత్రిని చేయగలదా ? అని మురుగన్ ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి బాలరాజుకు జీవో నంబర్ 217 పై కనీసం అవగాహన లేదని సమావేశానికి హాజరైన బి,జె.పి. ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు.
ఈ కార్యక్రమానికి ముందు కేంద్ర మంత్రి మురుగన్ నెల్లూరు నగరంలో మత్స్యకార సంక్షేమ సమితి నాయకులతో సమావేశ మయ్యారు. ఒక్కో మత్స్యకార గ్రామానికీ 7.5 కోట్ల రూపాయల పైచిలుకు మొత్తం అందజేయనున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథం ద్వారా నిధులు విడుదల అవూతాయని చెప్పారు. మత్య్యకార మహిళల కోసం  సీ-విడ్ అనే కొత్త పథకం రానుందని తెలిపారు.   మత్య్యకార గ్రామాలను పారిశ్రామిక వేత్తలు  దత్తత తీసుకునే విదంగా ఆలోచనలు చేస్తున్నట్లు  కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: