టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ధూళిపాళ్ళ నరేంద్ర డ్రగ్స్ విషయంలో చేసిన ఆరోపణలు అన్నీ సంచలనం అయ్యాయి. కాకినాడ పోర్ట్ లో బయటకు వచ్చిన అంశాల గురించి ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నేపధ్యంలో టీడీపీ  సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. పొన్నూరు మండలం చింతలపూడిలోని నరేంద్ర ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు పోలీసులు. మాదకద్రవ్యాల రవాణాపై ప్రభుత్వం పై విమర్శలు చేసిన నరేంద్రనను... ఆధారాలు ఇవ్వాలని నరేంద్రకు నోటీసులు ఇచ్చారు.

నోటీసులు అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన నరేంద్ర... రాష్ట్ర ప్రభుత్వంపై అలాగే పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కాకినాడ తీరంలో బోటు తగలబడినప్పుడు మాదకద్రవ్యాల వాసన వచ్చిందని సమాచారం ఉందని అన్నారు. ఇదే సమాచారంతో నేను మీడియాతోమాట్లాడా అని ఆయన పేర్కొన్నారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు గుప్పించారు. వేల కోట్ల డ్రగ్స్ దొరికితే ముఖ్యమంత్రి తీరిగ్గా స్పందించారు అని ఆయన విమర్శించారు. విద్యాసంస్థల్లో మత్తుమందులు ఉండరాదని ముఖ్యమంత్రి చెప్పటం అనుమానాలకు తావిస్తోంది అన్నారు.

ఇప్పటి వరకూ విద్యాసంస్థల్లో మత్తుమందులు ఉన్నట్లే అనిపిస్తోంది అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ధూళ్లిపాళ్ళ నరేంద్రకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన కాకినాడ పోలీసులతో ధూళిపాళ్ళ ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వదిలి మాకు నోటీసులు ఇవ్వడమేమిటి? అని ఆయన నిలదీశారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంభధించి ఏం సమాచారం సేకరించారు? అని డ్రగ్స్ కేసు ఎన్ ఐ ఏ కదా దర్యాప్తు చేస్తున్నది... మీరు ఆధారాలు సేకరించడం ఏమీటి? అని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియాపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ పెద్దలను ఎందుకు ప్రశ్నించలేదు? అని నిలదీశారు. నిషేదిత మాదక ద్రవ్యాల రవాణా జరగడంపై దోషులెవరన్నది తేల్చడం మీ బాధ్యత కాదా? అని పోలీసులపై మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: