ఏపీలో కులాల వారీగా రాజకీయాలు జరగవు అని ఎవరైనా మాట్లాడితే....అది పెద్ద అబద్దమనే చెప్పాలి. అసలు ఏపీలో కులాల బట్టే రాజకీయాలు నడుస్తాయి...అలాగే ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒక కులానికి పెద్ద పీఠ వేస్తారు. ఎందుకంటే పార్టీ అధినేతలకు చెందిన కులాలకు ఆయా పార్టీల్లో ప్రాధాన్యత ఎక్కువ. చంద్రబాబు కమ్మ కులం కాబట్టి టి‌డి‌పిలో ఆ కులానికే ప్రాధాన్యత ఎక్కువ. జగన్ రెడ్డి కులం కాబట్టి...వైసీపీలో ఆ కులానిదే ఆధిపత్యం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

అందుకే టి‌డి‌పి గెలిచింది 23 మంది ఎమ్మెల్యేలే అయినా...అందులో సగం మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉంటారు. ఇక వైసీపీలో రెడ్డి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో రెడ్డి ఎమ్మెల్యేలు బాగా ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ రెడ్డి ఎమ్మెల్యేల్లో ఎంతమంది గొప్ప పనితీరు కనబరుస్తున్నారు? ఎంతమంది పార్టీని నిలబెట్టేలా పనిచేస్తున్నారు? అంటే కొంతమంది రెడ్డి ఎమ్మెల్యేలే మాత్రమే ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నారని చెప్పొచ్చు.

వైసీపీలో పలువురు రెడ్డి ఎమ్మెల్యేలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి తగ్గట్టుగా పనిచేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే రెడ్డి ఎమ్మెల్యేలకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అంటే రెడ్డి ఎమ్మెల్యేలకు ప్రజలు సపోర్ట్ ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. అలా ప్రజల మద్ధతు ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందు వరుసలో ఉంటారు. మాచర్లలో ఈయనకు తిరుగులేదు.

కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి, సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆత్మకూరులో మేకపాటి గౌతంరెడ్డి(మంత్రి)లకు వారి వారి నియోజకవర్గాల్లో బలం ఎక్కువగానే ఉంది. ఇక పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలం గురించి చెప్పాల్సిన పని లేదు. అటు చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురులేదు. అనంతపురంలో అనంత వెంకట్రామి రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, శ్రీశైలంలో శిల్పా చక్రపాణిరెడ్డి, పాణ్యంలో కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డిలు స్ట్రాంగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: