తమ సహనాన్ని పరీక్షించవద్దు అంటూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతల తీరు ఇప్పుడు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఉద్యోగులకు ఒకటో తారీకు గీతాలు, ఉద్యోగులకు ఏడో తేదీ కూడా పెన్షన్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఉద్యోగ సంఘ నేతలు.... సమస్యలు పరిష్కరించకపోతే పోరాటానికి సిద్ధమంటూ నిన్న ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరోనా వైరస్ వల్ల జరిగిన కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకాలం ప్రభుత్వానికి సహకరించామని చెప్పుకొచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు... ఉద్యోగుల ప్రయోజనాలను ఎంతకాలం తాకట్టు పెట్టాలంటే ప్రశ్నించారు. ఉద్యోగుల కష్టాలు చెబుతుంటే ఉన్నత అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే పిఆర్సి రద్దు చేస్తామని చేసిన ప్రకటన ఏమైంది అంటూ ముఖ్యమంత్రి జగన్ సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నామన్నారు  ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు. సమస్యలు పరిష్కరించకపోతే సమైక్యంగా పోరాడుతామని.. ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణ కూడా ప్రకటిస్తాం అంటూ హెచ్చరించారు ఏపీ జేఏసీ చైర్మన్ ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షులు.

అయితే ఉద్యోగ సంఘాల మాటకి, పని తీరుకి ఎక్కడ పొంతన కుదరట్లేదు. ఉద్యోగ సంఘ నేతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన విషయం తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు సరిగ్గా మీడియా సమావేశం ప్రారంభానికి ఐదు నిమిషాల ముందు ఫోన్ చేశారు. ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావుతో ప్రత్యేకంగా మాట్లాడిన అజ్ఞాత వ్యక్తి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవతలి నుంచి ఫోన్ వచ్చిన వెంటనే... బండి శ్రీనివాస రావు... సార్ కంట్రోల్ లోనే ఉంటాం.. గీత దాటం.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.. అంటూ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ తర్వాత అరె ఫోన్ కాల్ మాట్లాడిన ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా అవతలి వారికి భయపడుతూనే సమాధానమిచ్చారు. పరిధిలోనే ఉంటాం గీత దాటి పరిస్థితి లేదంటూ ఎంతో వినయంగా సమాధానం ఇచ్చారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. అయితే ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న ఒక్కటే... ఫోన్ చేసి ఉద్యోగ సంఘాల నేతలను బెదిరించిన వ్యక్తి ఎవరు. ఆయన ఏమని వార్నింగ్ ఇచ్చారు. అనేది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో బలంగా చర్చ నడుస్తుంది. ఇలా భయపడుతూ ఉంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయా అని కూడా ప్రభుత్వ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: