పాదయాత్ర అన్నది సక్సెస్ మంత్ర కావొచ్చు కొన్నిసార్లు. అన్ని సార్లూ కాదు. చంద్రబాబు ఎందుకని ఈ నిర్ణయం అందుకున్నా రని? ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో  ఉద్యమాలు వద్దనుకుని పాదయాత్రలు చేయాలనుకోవడం ఎందుకని?

70 ఏళ్లు దాటిన తరువాత కూడా  చంద్రబాబు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పరితపిస్తున్నారు. పరిణామాలు ఎలా ఉ న్నా ఆయన పాదయాత్ర కారణంగా గొప్ప ఫలితాలు వెల్లడవుతాయి అనుకోవడం ఊహకే పరిమితం. ముఖ్యంగా చంద్రబాబు హ యాంలో ఆయన వెంట నడిచిన సీనియర్ లీడర్లు ఇవాళ ఆయన స్థాయిలో పార్టీ బలోపేతానికి పనిచేస్తున్న దాఖలాలు లేవు అ న్నది ఓ వాస్తవం. శ్రీకాకుళం జిల్లా మొదలుకుని రాజధాని వరకూ కార్యకర్తలు ఉన్నా వారిని నడిపే వారు అంతగా ఫోకస్ చేయ డం లేదని విమర్శ వస్తోంది. ఆయన పాదయాత్రతో ఇవి తీరిపోతాయి అనుకోవడం కూడా భ్రమే! ఇప్పుడు లోకేశ్ కానీ మరొకరు కానీ బాబు స్థానంలో పాదయాత్ర చేసినా క్రేజ్ రానే రాదు. అలా అని బాబు పాదయాత్ర చేసినా  అప్పటిలా సానుభూతి పవనాలు జగన్ పై వీచిన విధంగా ఇప్పుడు ఉండవు. ఏ మాటకు ఆ మాట రాష్ట్రంలో ఆయన అనుకున్నంత క్రేజ్ ను మళ్లీ తెచ్చుకోవడం కూడా కష్టం. విపక్షంలో ఆశించిన స్థాయిలో టీడీపీ రాణించడం లేదన్న వాదన కూడా ఉంది. ఇవన్నీ బాబు పాదయాత్రకు అడ్డం కులు కావొచ్చు.


ఇంకా చెప్పాలంటే.....: 
పాదయాత్రతోనే వైఎస్ అధికారంలోకి వచ్చారు. పాదయాత్ర చేశాకే జగన్ జనంకు చేరువయ్యారు. అంతకుమునుపు షర్మిల పాదయాత్ర కూడా మంచి పేరు తెచ్చుకుంది. పాదయాత్ర చేస్తేనే మంచి ఫలితాలు అన్న ఆలోచన ఎంతవరకూ సబబు అన్నది తేలకపోయినా, సానుభూతి రాజకీయాల్లో భాగంగా చంద్రబాబు నయా వ్యూహాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికింకా పాదయాత్రకు సంబంధించి షెడ్యూల్ కన్ఫం కాకపోయినా రేపటి వేళ అధికారం రావాలంటే పాదయాత్రకు సిద్ధం కాక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో పాదయాత్ర ద్వారా బాబు సాధించిదేంటి? ఆయన వయస్సు అంగీకరిస్తుందా? జగన్ మాదిరి రాష్ట్రం అంతా తిరిగి ప్రజల సమస్యలపై ఫోకస్ చేయగలరా అన్నవి ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు. అయితే ఆయనతో పాటు జిల్లా శ్రేణులు పాదయాత్రకు సిద్ధంగా ఉన్నాయా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అధికారం దూరమైనప్పటి నుంచి కార్యకర్తలు ఎవరి దారి వారు చూసుకున్నారు. అంతేకాకుండా పార్టీలో క్షేత్ర స్థాయిలో అనైక్యత ఉంది. బాబు పాదయాత్ర  చేస్తే ఇవి దూరం అవుతాయా అన్నది కూడా ఓ సందేహం.


మరింత సమాచారం తెలుసుకోండి: