జిల్లాల‌కు సంబంధించి కొంద‌రిని నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జిలుగా ఫిక్స్ చేశారు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెన్నాయుడు. ఉత్త‌రాంధ్ర వ రకూ విశాఖ జిల్లా మాడుగుల శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి పీవీజీ కుమార్ ను, విజ‌య‌న‌గ‌రం జిల్లా, సాలూరు శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జిగా గుమ్మ‌డి సంధ్యారాణిని నియామాకం చేశారు. మిగిలిన ఉత్త‌రాంధ్ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు మా త్రం తొలి విడ‌త జాబితాలో పేర్లు లేవు. తొలి విడ‌త జాబితాలో శ్రీ‌కాకుళం జిల్లాకు సంబంధించి ఏ పేరూ లేదు. చిత్తూరు జిల్లాకు సంబంధించి రెండు నియోజ‌క‌వ‌ర్గాలు (పుంగ‌నూరు, గంగాధ‌ర నెల్లూరు), ప్ర‌కాశంకు సంబంధించి ద‌ర్శి, కృష్ణా జిల్లాకు సంబంధించి పామ‌ర్రు నియోజ‌క వ‌ర్గంకు సంబంధించి ఇంఛార్జి పేర్ల‌ను క‌న్ఫం చేయ‌గా, మిగ‌తా ప్రాంతాల‌కు సంబంధించి ఇంకా ఎటువంటి స‌మాచారం లేదు. ఈ నేప‌థ్యంలో ఒక‌వేళ పొత్తులుంటే ఏయే స్థానాలు కోల్పోయే అవ‌కాశం ఉంద‌న్న ఊహ‌లు, అపోహ‌లు వ‌స్తున్నాయి.

శ్రీ‌కాకుళం  వ‌ర‌కూ జ‌న‌సేన‌తో పొత్తు ఉంటే పాత‌ప‌ట్నం, ఇచ్ఛాపురం ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప‌వ‌న్ అభ్య‌ర్థులు బ‌రిలో ఉండే ఛాన్స్ ఉంటుంది. నెల్లిమ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంకు సంబంధించి మాజీ మంత్రి ప‌తివాడ నారాయ‌ణ స్వామి ఉన్నారు. ఆయ‌న స్థానంలో కొత్త వారికి ఇచ్చే అవ‌కాశం ఉంది. కుద‌ర‌క‌పోతే జ‌న‌సేన‌తో పోటీ చేయించే అవ‌కాశం ఉంది. బ‌డ్డు కొండ అప్ప‌ల‌నాయుడు (వైసీపీ ఎమ్మెల్యే)గా కొన‌సాగుతున్నారు. బొత్స మ‌నిషిగా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. పొత్తు ధ‌ర్మంలో భాగంగా జ‌న‌సేన చీపురు ప‌ల్లి కూడా అడ‌గ‌వ‌చ్చు. ఇక్క‌డ బొత్స స‌త్య‌నారాయ‌ణ ఎమ్మెల్యేగా ఉన్నారు..ఆయ‌న ఎంపీగా వేసే ఛాన్స్ ఉంది క‌నుక వైసీపీ బ‌రిలో బొత్స మ‌నిషికే ఛాన్స్ ఉన్న‌ప్ప‌టికీ., బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉన్న బొత్స‌ను ఢీ కొనేందుకు టీడీపీ బదులు జ‌న‌సేన ఇక్క‌డ పోటీ చేసే అవ‌కాశం ఉంది. విశాఖ జిల్లాకు సంబంధించి టీడీపీ జ‌నసేన పొత్తు ఉంటే గాజువాక, విశాఖ ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం ఈ రెండు అసెంబ్లీ స్థానాల‌ను జ‌న‌సేన అడ‌గ‌వ‌చ్చు అని తెలుస్తోంది. గాజువాక ఎమ్మెల్యేగా  తిప్ప‌ల నాగిరెడ్డి, ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గా వాసుప‌ల్లి గ‌ణేశ్ ఉన్నారు. ఈ ఇద్ద‌రూ  ప్ర‌స్తుతం వైసీపీ మ‌నుషులే! అయితే టీడీపీతో జ‌న‌సేన పొత్తుపెట్టుకుంటే ఇక్క‌డ ఆశించిన ఫ‌లితాలు అయితే రావు అని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో చిన‌బాబు ద‌గ్గ‌ర పంచాయ‌తీ చేరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: