చిత్తూరు జిల్లా అంటే...మొన్నటివరకు చంద్రబాబు పేరు గుర్తొచ్చేది....ఎందుకంటే చిత్తూరు జిల్లా...చంద్రబాబు సొంత జిల్లా కాబట్టి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చిత్తూరు అంటే..మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే అంతలా జిల్లాపై పెద్దిరెడ్డి పట్టు తెచ్చుకున్నారు కాబట్టి...జిల్లాలో ప్రతి నియోజకవర్గంపై పెద్దిరెడ్డికి పట్టు ఉంది. ఆఖరికి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపైనే పట్టు సాధించడానికి పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కుప్పంపై పట్టు కూడా తెచ్చుకున్నారు.

అలా జిల్లాపై పట్టు ఉన్న పెద్దిరెడ్డికి చెక్ పెట్టడానికి చంద్రబాబు నానా కష్టాలు పడుతున్నారు. అసలు ముందు పెద్దిరెడ్డికి సొంత నియోజకవర్గం పుంగనూరులో చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నిక...ఎన్నికకు అభ్యర్ధులని మార్చుకుంటూ వెళుతున్నారు. 2009లో పెద్దిరెడ్డి కాంగ్రెస్‌లో ఉండగా, అప్పుడు టి‌డి‌పి తరుపున వెంకటరమణ రాజుని పోటీ పెట్టారు. కానీ అప్పుడు గెలుపు పెద్దిరెడ్డిదే. 2014 ఎన్నికల్లో పెద్దిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేయగా, వెంకటరమణ మళ్ళీ టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే ఈ సారి లాభం లేదని చెప్పి చంద్రబాబు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బంధువు అనీషా రెడ్డిని ఈ సారి పుంగనూరు బరిలో పెట్టారు. కానీ 2019 ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డిదే విజయం. దాదాపు 42 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి ప్రత్యర్ధి మారిపోయారు.

ఇప్పటికే అనీషా రెడ్డి యాక్టివ్‌గా పనిచేయడం లేదు...దీంతో చంద్రబాబు ఆమెని సైడ్ చేసి...పుంగనూరు టి‌డి‌పి ఇంచార్జ్‌గా చల్లా రామచంద్రారెడ్డిని నియమించారు. చల్లాకు పుంగనూరుపై కాస్త పట్టు ఉంది. కానీ పెద్దిరెడ్డికి చెక్ పెట్టే సత్తా మాత్రం లేదనే చెప్పొచ్చు. అక్కడ ప్రజలు ఏకపక్షంగా పెద్దిరెడ్డి వైపు ఉన్నారు. వారు పెద్దిరెడ్డిని దాటి వేరే పార్టీని గెలిపించడం కష్టమే అని చెప్పొచ్చు. మొత్తానికైతే చంద్రబాబు పుంగనూరులో కొత్త ఇంచార్జ్‌ని పెట్టినా సరే పెద్దిరెడ్డికి చెక్ పెట్టడం కష్టమే అని చెప్పొచ్చు.    

మరింత సమాచారం తెలుసుకోండి: