టి‌డి‌పి అధినేత చంద్రబాబు....వరుసపెట్టి పార్టీ నాయకత్వం బలంగా లేని నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని నియమిస్తూ వస్తున్నారు. అంటే బలంగా లేని నాయకులని పెట్టి కొత్త ఇంచార్జ్‌లని నియమిస్తున్నారు. తాజాగా పలు నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లని మార్చేసి...కొత్తవారిని నియమించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో సైతం గంగాధర నెల్లూరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా భీమినేని చిట్టిబాబును నియమించారు.

జీడీ నెల్లూరు ఇంచార్జ్ హరికృష్ణ అంత యాక్టివ్ గా ఉండకపోవడంతోనే కో-ఆర్డినేటర్‌ని నియమించినట్లు తెలుస్తోంది. అలాగే పుంగనూరులో అనీషా రెడ్డిని పక్కనబెట్టి, చల్లా రామచంద్రారెడ్డిని ఇంచార్జ్‌గా పెట్టారు. అయితే చిత్తూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లు యాక్టివ్ గా లేరు....అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లే లేరు. మరి ఆ నియోజకవర్గాలని బాబు ఎందుకు మార్చలేదో క్లారిటీ లేదు. త్వరలో ఏమన్నా ఆ నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తారేమో చూడాలి.

అయితే చిత్తూరులో టి‌డి‌పికి సరైన నాయకత్వం లేని నియోజకవర్గాల్లో తంబళ్ళపల్లె ఒకటి...ఇక్కడ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాద‌వ్‌ అడ్రెస్ లేరు. అసలు ఇక్కడ టి‌డి‌పి ఉందా? అనే పరిస్తితి ఉంది. ఇక్కడ కొత్త ఇంచార్జ్‌ని పెట్టాల్సిన అవసరముంది. ఇక గత ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీలో పోటీ చేసి ఓడిపోయిన ఏ‌ఎస్ మనోహర్ టి‌డి‌పికి రాజీనామా చేసేశారు. దీంతో అక్కడ టి‌డి‌పి ఖాళీగా ఉంది. అక్కడ మరో ఇంచార్జ్‌ని పెట్టలేదు... ఒకవేళ దివంగత మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ ఫ్యామిలీ నుంచి ఎవరికైనా చిత్తూరు బాధ్యతలు అప్పగిస్తారేమో చూడాలి.

ఇక టి‌డి‌పి గెలుపు మరిచిపోయిన పూతలపట్టులో కూడా మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి....టి‌డి‌పిని వీడారు. లలిత కుమారి పార్టీని వీడాక ఇక్కడ మరొక నాయకుడుకు బాధ్యతలు అప్పగించలేదు. త్వరగా పూతలపట్టు, చిత్తూరు, తంబళ్ళపల్లె నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లని పెట్టాల్సిన అవసరముంది. అలాగే పలు నియోజకవర్గాల్లో నాయకులు యాక్టివ్ గా లేరు....వారిని యాక్టివ్ చేయాల్సిన అవసరముంది. మ‌రి చంద్ర‌బాబు వీటి విష‌యంలో ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: