మొన్నటివరకు చైనా విస్తరణ ధోరణితో వ్యవహరించిన తీరు ప్రపంచ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.  ముఖ్యంగా భారత్ చైనా సరిహద్దుల్లో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో గత కొన్ని నెలల నుంచి కూడా భారత సరిహద్దుల్లో ఎప్పుడు యుద్ధం వస్తుందో అనే విధంగానే ఉంది పరిస్థితి  అయితే చైనా దూకుడుకు భారత సైన్యం భయపడుతుందని డ్రాగన్ దేశం భావించినప్పటికీ అటు భారత సైన్యం మాత్రం ఊహించని విధంగా  చైనా కు ఎదురు నిలబడి పోరాడింది.  చైనా సైనికులు అందరు కూడా వణికి పోయే విధంగా పోరాట ప్రతిభ కనబరిచింది.



 దీంతో సరిహద్దుల్లో నిషేధిత  భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలి అనుకున్న చైనా కు ఊహించని షాక్ తగిలింది అనే చెప్పాలి. అయితే సరిహద్దుల్లో ఓవైపు గడ్డకట్టుకుపోయే చలిలో కూడా ఇరు దేశాల సైనికులు పహార కాశారు.  ఈ క్రమంలోనే చైనా సైన్యం ప్రాణ భయంతో వణికి పోయే పరిస్థితి వచ్చింది. భారత సైనికులకు అన్ని రకాల వాతావరణంలో కూడా పహారా కాయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి   కానీ చైనా సైనికులు ఇలాంటి అనుభవం లేకపోవడంతో   ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే భారత సరిహద్దుల్లో రక్షణ కోసం వెళ్ళడానికి సైనికులు  భయపడిన పరిస్థితులు కూడా వచ్చాయి.



 ఇలాంటి సమయంలోనే భారత్ చైనా సరిహద్దుల్లో చైనా సైన్యాన్ని కంట్రోల్ చేసేందుకు చైనా ప్రభుత్వం దాదాపుగా మూడు సార్లు ఆర్మీ కమాండర్ లను మార్చింది.  ఇలా ఎంతమంది అధికారులను మార్చిన సైన్యం భయంలో మాత్రం మార్పు రాలేదు.  ఇక ఇటీవల భారత్ సరిహద్దులో చైనా మార్చిన ఆర్మీ అధికారి అనారోగ్యంతో మృతి చెందడం హాట్ టాపిక్ గా మారిపోయింది. చైనా ఆర్మీ విభాగానికి చెందిన ఇటువంటి  కమాండర్ జనరల్ సుడాన్ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఈ క్రమంలోనే చైనా మళ్లీ ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకుని రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా సరిహద్దుల్లో సైనికుల ప్రాణాలు పోతున్న చైనా బుద్ధి మాత్రం మారడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: