ప్రస్తుతం భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వేగంగా కొనసాగుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ పై అవగాహన రావడంతో..  టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే అటు కోట్ల మంది ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్నారు. అయితే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందరికీ వ్యాక్సినేషన్ పై మరింత అవగాహన కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలు కూడా ఉండటం గమనార్హం.  ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో వేగంగా కొనసాగుతోంది. దాదాపుగా అందరి లో కూడా మొన్నటి వరకు వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు అనుమానాలు తొలగి పోయాయి అని చెప్పాలి.



 కాగా ఇప్పటివరకు ఏకంగా 94 కోట్ల వరకు వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం గమనార్హం. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందించే విధంగా  భారత ప్రభుత్వం అన్ని రకాల ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. ఇలాంటి సమయంలో భారత్ గొప్ప మనసు చాటుకుంది. ముందు నుంచి చిన్న దేశాలకు వ్యాక్సిన్ అందించడంలో కీలకపాత్ర వహిస్తూ వస్తుంది భారత్. ఇక ఇప్పుడు భారత్లో వ్యాక్సిన్లా కొరత లేకపోవడం కావలసినన్ని వ్యాక్సిన్లు నిల్వ ఉండటంతో కరోనా వైరస్ తో అల్లాడిపోతున్న చిన్న దేశాలకు సహాయం చేసేందుకు సిద్ధమైంది.


 అగ్రరాజ్యాలు చిన్న దేశాల పై వ్యాక్సిన్ అందించడంలో చిన్నచూపు చూస్తున్న తరుణంలో భారత్ గొప్ప మనసు చాటుకుంటుంది. ఈ క్రమంలోనే చిన్న దేశాలకు వ్యాక్సిన్లు అందించేందుకు సిద్ధమైంది భారత ప్రభుత్వం. ఇటీవలే వ్యాక్సిన్ ఎగుమతులను భారత్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. భారత్ బయోటెక్ ఇరాన్ కి ఏకంగా ఒక మిలియన్ వ్యాక్సిన్ డోసులు అందించేందుకు సిద్ధమైంది. నేపాల్ మయన్మార్ బంగ్లాదేశ్ దేశాలకు అటు సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ఎగుమతి చేసేందుకు  సిద్ధమైంది. మరోవైపు ఆస్ట్రాజేనిక బ్రిటన్ కి కూడా టీకాలు ఎగుమతి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: