చంద్రబాబు.. దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. సందేహం లేదు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఇప్పుడు చంద్రబాబుకు సమయం బాగా లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఇటీవల బద్వేలు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ ప్రకటించడం.. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికలకూ బహిష్కరించడం  చూస్తే ఆ పార్టీ ఇప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉందా అన్న అనుమానం కలుగుతోంది.


అయితే.. చంద్రబాబుకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఆయనకు మీడియా అండ ఉంది. కొన్ని కీలక స్థానాల్లోని వ్యక్తుల అండ ఉంది. అది ఒక్కరోజుతో వచ్చింది కాదు. ఏళ్ల తరబడి ఆయన నెలకొల్పుకున్న సంబంధాల కారణంగా వచ్చిన అడ్వాంటేజ్ అది. అయితే.. ఇప్పుడు మీడియా సపోర్ట్ కూడా చంద్రబాబుకు కలసిరావడం లేదా.. అనుకూల మీడియా ఎంత ఊదరకొట్టినా ప్రయోజనం ఉండటం లేదా.. అంటే అవునేమో అనిపిస్తోంది.


తాజాగా ఓ వైసీపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.. ఆంధప్రదేశ్‌లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మీడియా పెద్దలు ఎంతగా జాకీలు వేసి లేపినా చంద్రబాబుకు అనుకూలంగా  గ్రాఫ్ లేవడం లేదట. రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడుగారు వంటి కమ్మ సామాజిక వర్గం మీడియాలు చంద్రబాబు కోసం రాష్ట్రంలో చాలా బలంగా పని చేస్తున్నాయట. అయితే.. వాటి వల్ల ఫలితం ఉండటం లేదనే చంద్రబాబు మరోసారి పవన్ కల్యాణ్‌ సాయం కోరుతున్నారని ఆ మంత్రి అంటున్నారు.


మీడియా పెద్దలంతా అసమర్థులు... పనికిరాని వ్యక్తులు... వీరి వల్ల కావడం లేదనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కల్యాణ్ సాయం చంద్రబాబు కోరుతున్నారా అని ఆ మంత్రి ప్రశ్నించారు. ఆ నలుగురు మీడియా పెద్దలు జగన్‌గారిని ఎలాగైనా అధికారం నుంచి దింపేయాలని విపరీతంగా కష్టపడుతున్నారని సదరు మంత్రి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: