మంచు విష్ణు తో మెగా కుటుంబం మంచి అనుబంధాన్నే కొనసాగిస్తోంది. ఈ మాట విష్ణు అంగీక‌రించ‌డం కూడా ఇక్క‌డ ప్రస్తావ‌న‌కు అర్హ‌త ఉన్న‌దే! అయితే త‌గాదాలున్న నేప‌థ్యంలో చిరు త‌న వంతు రాజీకి స‌హ‌క‌రించాల‌ని భావించి, ఆ విధంగా ఆయ‌న ముందుకు పోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప‌వ‌న్ సైతం నిన్న‌టి వేళ మోహ‌న్ బాబుతో ఆత్మీయంగా మాట్లాడి వెళ్లారు. ఇకపై రెండు కుటుంబాలూ సామర‌స్య పూర్వ‌కంగా సాగిపోదామ‌న్న ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేందుకు కొందరు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు త‌మ వంతు సాయం అందించ‌నున్నార‌ని ప్రాథ‌మికంగా తెలుస్తున్న స‌మాచారం. ఇప్ప‌టికే రెండు కుటుంబాల‌నూ ప్రేమించే, అభిమానించే రాఘ‌వేంద్ర‌రావు ఈ ప‌నికి పూనుకుంటార‌ని కొంద‌రు, మ‌రికొంద‌రు ఓ సీనియ‌ర్ నిర్మాత‌, న‌టుడు, పారిశ్రామిక వేత్త మ‌ధ్య‌వ‌ర్తిగా ఉంటార‌ని ఇంకొంద‌రు అంటుంటే, అనూహ్యంగా నాగార్జున పేరు కూడా విన‌వ‌స్తోంది. ఆయ‌న కూడా రెండు కుటుంబాల‌కూ కావాల్సిన వారే! ఇలా కొన్ని పేర్లు తెర‌పైకి వ‌చ్చి సంద‌డి చేస్తున్నాయి. వీటిలో ఏది నిల‌బ‌డుతుందో ఇప్ప‌ట్లో చెప్ప‌లేం.

మా ఎన్నిక‌ల ఫ‌లితాలు నిర్థార‌ణ అయిన అనంత‌రం మంచు విష్ణుతో మెగా కుటుంబం రాజీకి వెళ్ల‌నుంది అని తెలుస్తోంది. ఈ ఎన్ని క‌లు సామర‌స్యంగానే సాగాయ‌ని, క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పూర్తి ప్రాధాన్యం ఇచ్చార‌ని సంబంధిత ప‌ర్య‌వేక్ష‌కులు, మా మాజీ అధ్య‌క్షులు ముర ళీ మోహ‌న్ సంతృప్తి వ్య‌క్తం చేశారు. కౌంటింగ్ వేళ కూడా ఆయ‌నే మొత్తం ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించి మంచి పేరు తెచ్చుకున్నారు. మ రో వివాదానికి తావే లేకుండా ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు స‌భ్యుల‌ను సంతోష‌పెట్టింది. ఇప్పుడీయ‌నే మాలో ఉన్న రెండు వ‌ర్గాల‌ను రాజీ చేయ‌నున్నార‌ని స‌మాచారం.



అన్నీ కుదిరితే మెగా కుటుంబం ప్రొడ‌క్ష‌న్ హౌస్ లో ఓ మ‌ల్టీ స్టార‌ర్ చేసి వివాదానికి తెర దించాల‌న్న‌ది చిరు ప్ర‌య‌త్నం అని కూడా కొంద‌రు అంటున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పై మంచు హీరో విష్ణుతో కానీ మ‌నోజ్ తో కానీ  ఓ చిన్న చిత్రం తీసి కూడా త‌మ‌లో ఉన్న అసంతృప్త‌త‌ల‌ను త‌గ్గించాల‌న్న యోచ‌న కూడా చిరు చేస్తున్నార‌ని స‌మాచారం. ఇవ‌న్నీ ఊహాగానాలే కావొచ్చు. లేదా రేప‌టి వేళ ప్ర‌తిపాదన‌లు ఈ విధంగానే ఉండ‌వ‌చ్చు కూడా! ఈ నేప‌థ్యంలో ప‌రిణామాల‌ను ఎలా అయినా అర్థం చేసుకునే వీల్లేదు. వాటి వెనుక ఉన్న కార‌ణాల‌ను అంచ‌నావేయ‌కుండా ప‌రిణామాల‌ను అర్థం చేసుకోవ‌డ‌మే అవివేకం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: