ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ్మ ఒడి ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చింది. 1 నుంచి 12 త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుతున్న విద్యార్థుల‌కు ఏడాదికి రూ.15వేల చొప్పున వారి త‌ల్లుల అకౌంట్‌లలో న‌గ‌దు జ‌మ అవుతుంది. రెండేళ్ల నుంచి ల‌క్ష‌లాది మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జ‌మ చేసింది ప్ర‌భుత్వం. తాజాగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఓ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.  తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో సీఎం విద్యాశాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.  పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌, విద్యార్థులు హాజ‌రు, అమ్మఒడి, విద్యాకానుక‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు.
 
వీట‌న్నింటిలో అమ్మఒడిపై చ‌ర్చ ఎక్కువ‌గా సాగింది. ప‌థ‌కం తేదీ,  విద్యార్థుల హాజ‌రు త‌ప్ప‌నిస‌రితో పాటు కొన్ని సూచ‌న‌లు చేశారు. పిల్ల‌లందరినీ ఒడిబాట ప‌ట్టించి విద్య‌లో ఉత్త‌మంగా తీర్చిదిద్ద‌డ‌మే దాని ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. 75 శాతం  హాజ‌రైన విద్యార్థుల‌కు మాత్ర‌మే అమ్మఒడి ప‌థ‌కం అమ‌లు.. క‌రోనా కార‌ణంగా అమ‌లు చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొన్న‌ద‌ని చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. 2020 జ‌న‌వ‌రిలో అమ్మ ఒడి ప‌థ‌కాన్ని ప్రారంభించారు. క‌రోనా నేప‌థ్యంలో హాజ‌రు అమ‌లు చేయ‌లేక‌పోయారు. ఇక 2022 నుంచి ఈ ప‌థ‌కానికి హాజ‌రుకు అనుసంధానం చేయాల‌ని సీఎం వెల్ల‌డించారు. ఈ సంవ‌త్స‌రం త‌ప్ప‌కుండా అమ‌లు చేయాల‌ని అధికారులకు సూచించారు. విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం నుంచే దీనిని అందించాల‌ని.. జూన్ నుంచి అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు.

క‌రోనా త‌రువాత పాఠ‌శాల‌లు ఏవిధంగా ఉన్నాయ‌నే దానిపై అడిగి తెలుసుకున్నారు ముఖ్య‌మంత్రి.  క‌రోనా నివార‌ణ‌పై ఎలాంటి చ‌ర్య‌లు చేప‌డుతున్నార‌ని ఆరా తీశారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌తో పాఠ‌శాల‌ల‌పై క‌రోనా ప్ర‌భావం అంత‌గా లేద‌ని వివ‌రించారు. టీచ‌ర్లు అంద‌రూ వాక్సినేష‌న్ తీసుకోవ‌డం ద్వారా విధుల్లో చురుకుగా పాల్గొంటున్నార‌ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌లో హాజ‌రు శాతం  ఆగ‌స్టులో 73గా న‌మోదైంద‌ని.. సెప్టెంబ‌ర్‌లో 82 శాతానికి పెరిగింది. అక్టోబ‌ర్ వ‌ర‌కు న‌మోదు అయింద‌ని  వెల్ల‌డించారు.   ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో హాజ‌రు శాతం పెరిగింద‌ని, 91 శాతంగా ఉంద‌ని అధికారులు వివ‌రించారు సీఎం జ‌గ‌న్‌కు.  దీనిపై త్వ‌ర‌లోనే అధికారికంగా నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు స‌మాచారం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: