హుజురాబాద్ ఉప ఎన్నిక మూడు రాజ‌కీయ సిద్దాంతాల‌ను తేల్చ‌నుంది. 2018 ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌వ‌ర్గంలో బీజేపీకీ నోటా కంటే త‌క్కువ‌గా 1,683 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. కాంగ్రెస్‌కు 61 వేల ఓట్లు వ‌స్తే టీఆర్ఎస్‌కు ల‌క్షకు పైగా ఓట్లు ప‌డ్డాయి. ఆఖ‌రుకు ఒక ఇండిపెండెంట్ అభ్య‌ర్థికంటే త‌క్కువ ఓట్లు బీజేపీకి వ‌చ్చి ఐదో స్తానంలో నిలుచుంది. అప్పుడు అదో స్థానంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు ఈట‌ల ఓడినా గెలిచినా భారీ ఓట్లు ప‌డ‌తాయి. ఎందుకంటే, ఈట‌ల‌కు హుజురాబాద్‌లో అంత ప‌లుకుబ‌డి ఉంది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి.


   ఇంకో విష‌యం ఏంటంటే బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాజ‌కీయాలు స‌మూలంగా మారిపోయాయి. ఆ పార్టీకి భారీగా ఓట్లు ప‌డుతున్నాయి. ప‌శ్చిమ బెంగాల్‌ను గ‌మ‌నిస్తే 2011 వ‌ర‌కు వామ‌ప‌క్షాలే 34 ఏళ్ల పాటు అవిచ్చినంగా పాలించింది. ఇప్పుడు చూస్తే లెఫ్ట్ ఫ్రంట్‌కు బెంగాల్ లో ఒక్క సీటు కూడా లేదు. ఇదే క్ర‌మంలో బీజేపీకి 70కి పైగా సీట్లు వ‌చ్చాయి. గ‌తంలో పోల్చుకుంటే బీజేపీకి 38 శాతంం ఓట్లు వ‌చ్చాయి. త్రిపుర‌లో 1 శాతం ఓటింగ్ ఉన్న బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చింది. ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు మ‌న‌కు చాలానే ఉన్నాయి.


  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 7 శాతం ఓట్లు పొందిన బీజేపీ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఏడాది లోపే 20 శాతం ఓట్లు పొందింది. ఇప్పుడు  నాయ‌కులు మారిన‌ప్పుడు ఇంకా ఆ ప్ర‌భావం పెరుగుతుంది అని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. రెండ‌వ‌ది ఏంటంటే ద‌ళిత‌బందు ప‌థకం అమ‌లు త‌రువాత జ‌రుగుతున్న ఎన్నిక‌. ఈ ప‌థకం ద్వారా పెద్ద ఎత్తున న‌గదు బ‌దిలీ చేసినా ఓట్లు వేయ‌రా.. ద‌ళిత‌ల‌తో పాటు ఇత‌ర వ‌ర్గాల‌కు కూడా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామంటున్నారు కేసీఆర్‌. ఇప్పుడు కూడా కేసీఆర్ ఓడిపోతే దేశ‌వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ అవుతుంది.


   రెండు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య ఓట్లు పోల‌రైజ్ అయితే మిగ‌తా పార్టీలు కొట్లుకుపోవ‌డం ఖాయం. బెంగాల్‌లో బీజేపీ, తృణ‌ముల్ కాంగ్రెస్ పార్టీల‌కు ఓట్లు పోల‌రైజ్ అయితే కాంగ్రెస్, వామ‌ప‌క్షాల‌న్ని కొట్టుకుపోయాయి. అలాగే ఏపీలో కూడా వైసీపీ, టీడీపీకి ఓట్లు పోల‌రైజ్ అయితే కాంగ్రెస్‌, బీజేపీ, వామ‌ప‌క్షాల‌న్ని తుడిచిపెట్టుకుపోవ‌డం మ‌న‌కు తెలిసిందే. దీంతో కాంగ్రెస్ ప‌రిస్థితి అర్థ‌మ‌వుతుంది. ఇది రాబోయే ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.



       

మరింత సమాచారం తెలుసుకోండి: