టీడీపీ అధినాయకుడు చంద్రబాబు జాతీయ స్థాయిలో సీనియర్ మోస్ట్ నేత. ఆయన ప్రధాని కావాల్సిన నేత కూడా. నిజానికి 2019 ఎన్నికల్లో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే లోకేష్ ఏపీకి సీఎం బాబు జాతీయ రాజకీయాల్లోకి అని విస్తృతంగా నాడు ప్రచారం అయితే సాగింది.

కానీ అదే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం సీట్లో మెజారిటీ సగానికి సగం పడిపోయింది. అంతేనా బాబు కొన్ని రౌండ్లలో వెనకబడిపోయారు కూడా. ఇక నాటి నుంచి కుప్పం చంద్రబాబుకే కాదు తమ్ముళ్ళనూ భయపెడుతోంది. గత రెండున్నరేళ్ళలో కుప్పంలో టీడీపీ ఏ మాత్రం ఎత్తిగిల్లింది అంటే జవాబు డౌటే. ఇక వైసీపీ ఏలుబడిలో పూర్తి ఫోకస్ కుప్పం మీద పెట్టేశారు. కుప్పానికే ప్రత్యేకించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా పనిచేస్తున్నారా అనిపించేలా ఫుల్ టార్గెట్ ఉంది.

దాని ఫలితాలు కూడా ఫ్యాన్ పార్టీకి బాగానే అందుతున్నాయి. కుప్పంలో ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల నుంచి పరిషత్ ఎన్నికల దాకా అన్నీ కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. చూడబోతే సార్వత్రిక ఎన్నికలకు టైమ్ కూడా తక్కువ ఉంది. మరి కుప్పం రిపేర్లు ఇప్పటికీ  చేసుకోకపోతే బాబుకు వచ్చే ఎన్నికల్లో సీటు ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే బాబు కుప్పం టూర్లు వేస్తున్నారు అంటున్నారు. ఈ మధ్యనే అంటే పంచాయతీ ఎన్నికల తరువాత కుప్పంలో బాబు పర్యటించారు. ఇపుడు మళ్ళీ మూడు రోజుల టూర్ కి ప్లాన్ చేశారు.

గతసారి టూర్ లో జూనియర్ ఎన్టీయార్ ని పార్టీలోకి తీసుకుని రమ్మని ప్రియమైన కుప్పం తమ్ముళ్ళు తమ ఆకాంక్షను
బాబు ముందే బహిరంగంగా వెల్ల‌డించారు. ఈసారి మరి ఎలాంటి కోరికలు చెబుతారో, ఏ రకమైన సలహాలు ఇస్తారో అన్న టెన్షన్ కూడా ఉంది. ఏది ఏమైనా బాబు కుప్పం కోసం వరస టూర్లు చేపట్టడం మాత్రం వైసీపీ నేతలకు ఖుషీగా ఉందిట. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వేళ కూడా నామినేషన్ పత్రాల దాఖకులు బాబు ఎపుడూ వచ్చే వారు కాదు, ఇక బాబు గతంలో పెద్దగా పర్యటనలూ చేసిన వారు కాదు, ఇపుడు కుప్పం అంటూ కలవరిస్తున్నారు అంటే మేము విజయం సాధించిన‌ట్లే అని వైసీపీ నేతలు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: