ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా...అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని నడిపే పరిస్తితి కనిపించడం లేదు. రాష్ట్ర విభజన జరిగాక ఏపీకి ఆదాయం తగ్గింది...అప్పులు పెరిగాయి. విభజన సమయంలోనే రాష్ట్రం వాటా కింద దాదాపు 90 వేల కోట్లు అప్పులు వచ్చి పడ్డాయి. ఇక అప్పులని ఇంకా పెంచుతూ....తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్లింది. ఆ 90 వేలే కాకుండా...ఐదేళ్లలో అదనంగా లక్షన్నర కోట్లు అప్పులు చేసింది.

ఇక అప్పుడే ప్రతిపక్షాలు, రాజకీయ మేధావులు....అప్పులు విషయంలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇలా చేసుకుంటూ వెళితే రాష్ట్రం దివాళా తీస్తుందని మాట్లాడారు. అయితే అయిదేళ్లకు చంద్రబాబు ప్రభుత్వం గద్దె దిగింది. మరి నెక్స్ట్ జగన్ అధికారంలోకి వచ్చారు. సరే జగన్ అంతా సెట్ చేసేస్తారని అంతా అనుకున్నారు.

కానీ ఆ పరిస్తితి ఎక్కడా కనిపించలేదు. జగన్ ప్రభుత్వం రెండేళ్లలోనే దాదాపు లక్షన్నర కోట్లు అప్పులు చేసింది.. అయితే అధికారికంగానే ఈ అప్పు అని, అనధికారికంగా మరో 70 వేల కోట్లు వరకు అప్పులు చేసిందని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి పెద్దలు చెప్పారు. అంటే జగన్ ప్రభుత్వమే రెండేళ్లలో రెండు లక్షల కోట్లపైనే అప్పులు చేసింది. ఇక దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. త్వరలో రాష్ట్రం దివాళా తీయడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. పైగా అభివృద్ధి ఏమి లేకపోవడంతో, రాష్ట్రం ఆస్తులని తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తుంది.

కానీ ఈ అప్పులని వైసీపీ సమర్ధించుకుంటుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కోసమే అప్పులు చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తే..అప్పుడు పవన్ లాంటి వారు ఎందుకు మాట్లాడలేదు..ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ లాంటి వారు ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా తమకు అనవసరమని రాష్ట్రంలో సంక్షేమం కోసం అప్పులు చేస్తామన్నట్లు బొత్స మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ జగన్‌ని కవర్ చేస్తున్నామని బొత్స అనుకుంటున్నారు...కానీ అప్పులు విచ్చలవిడిగా చేసేశామని పరోక్షంగా చెబుతూ...జగన్‌ని ఇంకా ఇరికిస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: