రూ.25 కోట్లతో నిర్మించిన చిన్నపిల్లల గుండె జబ్బుల చికిత్సల ఆసుపత్రి తాత్కాలిక భవనాన్ని ఏపీ సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. బాలల ఆరోగ్య వరప్రదాయని కానున్న శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఈ రోజు నుండి అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ఆస్ప‌త్రిలో ఈ నెల 12 వతేది నుండి ఓపి సేవలు ప్రారంభం కానున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతే కాకుండా డిసెంబర్ మొదటి వారం నుండి శస్త్ర చికిత్సలు కూడా మొద‌లు పెట్టనున్నారు. అనంత‌రం సీఎం జ‌గ‌న్ ఆసుపత్రి లో వైద్య సేవలు అందించే వివిద విభాగాల ను పరిశీలించారు..చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్స చేసేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలన్న దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి కోరిక‌ను సాకారం చేస్తూ సీఎం జ‌గ‌న్ ఈ ఆస్పత్రిని ప్రారంభించారు...

ఇక టిటిడి సౌజన్యంతో చిన్న పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయుటకు ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించింది..గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్ర చికిత్స చేయించడానికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తదితర రాష్ట్రాలకు వెళ్లవలసిన పరిస్థితి లేకుండా ఆర్థిక స్థోమత లేని నిరుపేద తల్లిదండ్రుల చిన్న పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయించాలని ప్రభు త్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉండ‌గా ఈ ఆసుపత్రిలో పీడియాట్రిక్ కార్డియాలజీ మరియు పీడియాట్రిక్ కార్డియో తోరాసిక్ సర్జరీ విభాగానికి సంబంధించి వైద్యులను టీటీడీ నియ‌మించింది. 25 పడకల ఐసియు, 50 పడకల సామర్థ్యంతో మరియు 3 లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు...అడ్వాన్స్ కాత్ ల్యాబ్, 3 డి కార్డియో ఎకోగ్రఫీ యంత్రాలు, 12 చానల్ ఈసిజి మెషిన్ లు, పోర్టబుల్ డి2డి ఏకొ కలర్ డాప్లర్ మెషిన్ లతో అంతర్జాతీయ స్థాయిలో ఈ హాస్పిట‌ల్ లో వైద్యాన్ని అందిచ‌నున్నారు. ఇదిలా ఉంటే టీటీడీ ఆధ్వ‌ర్యంలో ప‌లు సేవాకార్య‌క్ర‌మాలు చేస్తుండ‌గా ఇప్పుడు చిన్న పిల్ల‌ల కోసం ఆస్ప‌త్రి నిర్మించ‌డంపై ప్ర‌శంస‌లు అందుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: