రాజకీయాల్లో కొన్ని ఫ్యామిలీలకు ఎదురు ఉండదనే చెప్పొచ్చు...రాజకీయంగా ఎలాంటి పరిస్తితులు ఉన్నా సరే, ఆ ఫ్యామిలీలని ప్రజలు ఆదరిస్తూనే ఉంటారు. అలా ప్రజల ఆదరణ ఎక్కువగా ఉన్న ఫ్యామిలీల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ ఒకటి అని చెప్పొచ్చు. అసలు ఎన్నో ఏళ్లుగా ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి బలం ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డికి...మంచి పలుకుబడి ఉంది.

అలాగే ఈయనకు చిత్తూరు జిల్లాపై పూర్తి పట్టు ఉంది...అలాగే రాష్ట్రంలో ఇతర జిల్లాల్లోని రాజకీయాలపై కూడా పెద్దిరెడ్డికి పట్టు ఉంది. ఓ రకంగా చెప్పాలంటే వైసీపీకి పెద్దిరెడ్డి ఒక ప్లస్ అని చెప్పొచ్చు. అయితే ఇలా వైసీపీకి ప్లస్ గా ఉంటూ, ప్రత్యర్ధి పార్టీ టి‌డి‌పికి ఎక్కడకక్కడ చెక్ పెడుతున్న పెద్దిరెడ్డికి చెక్ పెట్టడం చంద్రబాబుకే సాధ్యం కావడం లేదు. పెద్దిరెడ్డికే కాదు...ఆయన ఫ్యామిలీకి సైతం చెక్ పెట్టలేని స్థాయిలో చంద్రబాబు ఉన్నారు.

మామూలుగానే పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించడం అసాధ్యమని చెప్పాల్సిన పని లేదు. అక్కడ పెద్దిరెడ్డికి ఇంకా తిరుగులేదు. ఒకవేళ రాష్ట్రంలో టి‌డి‌పి గాలి బలంగా వీచినా సరే, పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించడం సాధ్యం కాదనే చెప్పొచ్చు. సరే పెద్దిరెడ్డినే కాదు...ఆయన తనయుడు మిథున్ రెడ్డిని ఓడించడం టి‌డి‌పి వల్ల అయ్యేలా లేదు. గత రెండు పర్యాయాల నుంచి మిథున్ రెడ్డి...రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి భారీ మెజారిటీలతో గెలుస్తూ ఎంపీ అవుతున్నారు. అక్కడ టి‌డి‌పి...మిథున్ రెడ్డికి భవిష్యత్‌లో కూడా చెక్ పెట్టడం కష్టమనే తెలుస్తోంది.

ఇక పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి సైతం తంబళ్ళపల్లె అసెంబ్లీలో ఫుల్ స్ట్రాంగ్ అయ్యారు. ఇటీవల సర్వేల్లో ద్వారకానాథ్ రెడ్డి టాప్‌లో ఉన్నారని తెలిసింది. అంటే తంబళ్ళపల్లెలో పెద్దిరెడ్డి సోదరుడుకు టి‌డి‌పి చెక్ పెట్టడం కష్టమని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీని కదపడం చంద్రబాబు వల్ల కాదనే చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: