జగన్ @ 78  
 
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ .జగన్ మోహన్ రెడ్డి బరువు ఎంతో తెలుసా ? అ క్షరాల 78 కిలోలు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గోన్న ఆయన  మంగళవారం స్వామి వారి సన్నిధిలో తులా భారం తూగారు. మొక్కు చెల్లించుకున్నారు. అప్పుడు ఆయన బరువు 78 కిలోలు. ఈ విషయాన్ని టిటిడి స్వయంగా ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల తిరుపతిలో జరుగుతున్న కార్యక్రమాలను టిటిటి ప్రజా సంబంధాల శాఖ పత్రికా  ప్రకటనలను, ఫోటోలను విడుద చేస్తుంది. ఈ క్రమంలో  మంగళవారం తిరుమలలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన విశేషాలను కూడా వెల్లడించింది. ముఖ్యంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తులాభారం విశేషాలనూ అందిచింది.  తిరుమల వేంకటేశ్వర స్వామికి పలువురు భక్తులు పలు  రకాలుగా మొక్కులు చెల్లిస్తారు. నడక మొక్కు, తలనీలాల మొక్కు, పొర్లు దండం మొక్కు,  గోవింద మాల మొక్కు, ముడుపు మొక్కు, తులాభారం మొక్కు మొదలైన మొక్కులను భక్కులు శ్రీవారికి చెల్లిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  తాజా గా తులాభారం మొక్కు చెల్లించుకున్నారు. తులాభారం మొక్కులో భక్కులు  దేవాలయం లోపల ఉన్న త్రాసు లో తూగుతారు. తమ బరువు ఎంత ఉందో అంతే సమానమైన బరువుకు తగ్గ ధాన్యం, బియ్యం, బెల్లం లలో ఏదో ఒకటి కానీ, అన్నీ కానీ సమర్పించడం ఆనవాయితీ. మంగళవారం  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  తూలాభారంలో  తన బరువుకు సమానమైన 78 కిలోల బియ్యంను స్వామి వారికి మొక్కుగా చెల్లించారు.  తన కు పినతండ్రి, పినతల్లి వరస  అయిన  టిటిడి  చైర్మెన్ వై.వి. సుబ్బారెడ్డి దంపతుల సమక్షంలో  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  ఈ మొక్కు చెల్లించారు. ఈ  కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యవేక్షించారు. అంతకు ముందు  జగన్ మోహన్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని, దేవాయం చుట్టూ ప్రదక్షణ చేశారు. ఆ సమయంలోనే వకుళామాతను దర్శించుకున్నారు. ఆపై విమాన వేంకటేశ్వర్లకు  నమస్కరించారు. భాష్యకార్ల సన్నిధికి  ఇరవైపులా ఉన్న సబేరా, యోగానరసింహ స్వామికి  దర్శించుకున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

ttd