జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లా లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.  భద్రతా బల గాలు మరియు టెర్రరి స్టులకు మధ్య జరి గిన దారుణ కాల్పు ల్లో... ము గ్గురు టెర్రరి స్టులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. లష్కర్ తోయిబా ది రెసిస్టెన్స్  ఫ్రంట్ కు చెందిన ముగ్గురు టెర్రరిస్టులు మృతి చెందినట్లు భద్రతా దళాలు స్పష్టం చేశాయి. అంతేకాదు ఆవు ఉగ్రవాదుల నుంచి.. పెద్ద మొత్తంలో ఆయుధాలు మరియు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు భద్రత దళాలు స్పష్టం చేశాయి. 

 ఈ విషయాన్ని జమ్మూకాశ్మీర్ పోలీసులు కూడా అధికారికంగా వెల్లడించారు. " జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు టెర్రరిస్టులు మృతి చెందారు. ఆ టెర్రరిస్టులు మొత్తం లష్కర్ తోయిబా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందిన వారిగా తాము గుర్తించామన్నారు. ఈ టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరిన్ని పూర్తి వివరాలు ఈ విషయంపై త్వరలోనే ఓ ప్రకటన చేస్తాం. 

ఎవరూ కూడా  ఆందో ళన చెందనవసరం లేదు. దేశ రక్షణ తమకు ముఖ్యం. జమ్మూ కాశ్మీర్ లోని ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదు. " అంటూ జమ్మూకాశ్మీర్ పోలీసులు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందగా.. ఇదే తరుణంలోనే.. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదిని అరెస్టు చేశారు డిల్లీ పోలీసులు. అంతేకాదు ఆ ఉగ్రవాది నుంచి భారీ స్థాయిలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు డిల్లీ పోలీసులు. దసరా పండుగ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీ కుట్ర కు పాక్ ఉగ్రవాదులు పన్నాగం పన్ని నట్లు ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు గ్రౌండ్ స్థాయిలో దర్యాప్తు మొదలు పెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: