చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు వ్య‌క్తుల‌తో జ‌గ‌న్ కు ఉన్న త‌గాదాలు అన్నీ మొన్న‌టి మా ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపాయి. ఆదివారం ఆట మామూలుగా లేదు. లాస్ట్ వ‌ర‌కూ చుక్కలు చూపిస్తూనే ఉంది. అలాంటి ఆట మ‌ళ్లీ చూడ‌లేం కూడా! చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి కొన్ని నిర్ణ‌యాలు త‌మ‌కు ప్ర‌తిబంధకంగా ఉన్నాయ‌ని ఇప్ప‌టికే కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. ముఖ్యంగా టికెట్ల అమ్మ‌కం అన్న‌ది ప్ర‌భుత్వ‌మే పోర్ట‌ల్ ద్వారా చేప‌ట్ట‌నుండ‌డంపై  అభ్యంత‌రాలు వ‌స్తున్నాయి. కానీ జ‌గ‌న్ మాత్రం అనుకున్న‌దేదో చేస్తూ వ‌స్తున్నారు. క‌రోనా సమ‌యంలో లాక్డౌన్ వేళ‌ల్లో థియేట‌ర్లు అస్స‌లు న‌డ‌వ‌లేదు. ఆ స‌మ‌యంలో క‌రెంటు బిల్లులు కూడా  చెల్లించుకోలేక యాజ‌మాన్యాలు అవ‌స్థ‌లు ప‌డ్డాయి. వాటిని ర‌ద్దు చేయాల‌ని ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నాయి. అదేవిధంగా ఆంధ్రాలో షూటింగ్ ల‌కు స‌ర‌ళ‌త‌ర విధానాల్లో అనుమ‌తులు కోరుకుంటున్నాయి.


స్టూడియోల ఏర్పాటుకు స్థ‌లం కేటాయించ‌మ‌ని అడుగుతున్నాయి. వినోద  ప‌రిశ్ర‌మ‌ను వైజాగ్ కేంద్రంగా ఏర్పాటు చేయాల‌న్న త‌మ ఆలోచ‌న‌కు జ‌గ‌న్ ఏ మేర‌కు స‌హ‌క‌రిస్తారో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కంగానే ఉంద‌ని, ముఖ్య‌మంత్రితో వీటిపై మాట్లాడే చొర‌వ విష్ణుకు ఉంద‌న్న అభిప్రాయాన్నీ ఇండ‌స్ట్రీ వ్య‌క్తం చేస్తుంది. ఈ ద‌శ‌లో బంధువులు అయిన విష్ణు బాబు, జ‌గ‌న్ ఇండ‌స్ట్రీ బాగు కోసం ఓ నిర్ణ‌యం చెబితే ఎంతో బాగుంటుంది. విష్ణు గెలుపున‌కు అర్థం ఉంటుంది. సార్థ‌క‌త అన్న‌ది చేకూరుతుంది. క‌ష్ట‌కాలంలో ఉన్న ఇండ‌స్ట్రీకి బ్యాంకు రుణాల రూపంలో కాస్త సాయం చేస్తే మినీ థియేట‌ర్ల నిర్మాణం ఒక‌టి సాధ్య‌మ‌వుతుంది. ఆ విధంగా కొంద‌రికి ప‌ని దొరుకుతుంది. అదేవిధంగా త‌క్కువ రేట్ల‌కే టిక్కెట్లు అమ్మాల‌న్న జ‌గ‌న్ ఆలోచ‌న‌కు ఓ అర్థం దొరుకుంతుంది. కానీ వీటికి సంబంధించి విష్ణు బాబు ప్ర‌భుత్వంపై ఏ పాటి ఒత్తిడి తేగ‌ల‌ర‌ని?


మా ఎన్నిక‌ల త‌రువాత సీన్ పూర్తిగా మారిపోయింది. కొంత‌మందైతే జ‌గ‌న్ ఆర్థిక సాయం కూడా విష్ణుకు చేశార‌ని అంటున్నారు. బామ్మ‌ర్ది గెలుపు బావ‌కు అవ‌స‌రం కావ‌డంతో, త్వ‌ర‌లో తాను తీసుకునే నిర్ణ‌యాల‌కు అడ్డు అన్న‌ది లేకుండా ఉండేందుకే ఇంత‌టి సాయం చేసి ఉంటార‌ని కూడా కొంద‌రు అంటున్నారు. వీటిలో నిజానిజాలు ఎంతున్నా కూడా మా అసోసియేషన్ కు మంచి జ‌రిగే ప‌ని ఒక‌టి జ‌గ‌న్ చేస్తారా అన్న‌ది కీల‌కంగా మారింది. తిండి లేక అవ‌స్థ‌ప‌డుతున్న కార్మికుల‌కు క‌నీసం ఏమ‌యినా సాయం చేస్తారా ? పోనీ విజ‌య‌వాడ కేంద్రంగా అయినా ఫిల్మ్ న‌గ‌ర్ ఏర్పాటుకు సాయం చేస్తారా అన్న‌ది ఇప్పుడు కీల‌కంగా మారింది. ఆంధ్రా ప్రాంతంలో ప‌నిచేస్తున్న సినీ కార్మికుల‌కు జ‌గ‌న్ ఏమ‌యినా వరాలు ఇవ్వ‌గ‌ల‌రా? ఇంత‌వ‌ర‌కూ థియేట‌ర్ కార్మికుల‌ను అస్స‌లు ప‌ట్టించుకోని జ‌గ‌న్ ఇప్పుడైనా మా అసోసియేష‌న్ అధ్య‌క్షుడు విష్ణుబాబు భేటీ త‌రువాత అయినా ప‌ట్టించుకుంటారా అన్న‌ది బిగ్ క్వ‌శ్చ‌న్.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp