క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను అత‌లాకుతం చేసింది. మొద‌టి ఉధృతి అనంత‌రం క‌రోనాకు వ్యాక్సిన్‌ను క‌నుగొన‌డంలో నిమ‌గ్న‌మ‌యింది ప్ర‌పంచం. అతి తొంద‌ర‌గానే వ్యాక్సిన్‌ను శాస్త్ర వేత్త‌లు సిద్ధం చేశారు. భార‌త్ కూడా అగ్ర రాజ్యాల‌యిన అమెరికా, చైనా, ర‌ష్యాల‌తో స‌మానంగా వ్యాక్సిన్ను క‌నిపెట్టింది. దాంతో పాటు ఉత్ప‌త్తి కూడా చేసింది. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ దేశాల‌కు క‌రోనా ఉధృతి వేల వ్యాక్సిన్‌లు అందించి బాస‌ట‌గా నిలిచింది. దీంతో ప్ర‌పంచం ముందు భార‌త్ శిక‌రాగ్రంలో నిలిచింది. 


అనంత‌రం దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఆప‌ద‌లో స‌హాయం చేసిన భార‌త్‌కు ప్ర‌పంచ దేశాలు వెన్నుద‌న్నుగా నిలిచాయి.. కృత‌జ్ఞ‌త భావంతో ఉన్నాయి.  అలాగే.. ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా తో పెద్ద ఎత్తున్న‌ ఇబ్బందులు ఎదుర్కొన్న దేశాల‌లో ఇరాన్ ఒక‌టి. లక్ష‌లాదిమంది ఇరానీయులు ప్రాణాలు కోల్పోయారు. కానీ, బ‌య‌ట‌కు మాత్రం అంటే ఆ దేశం వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ కు ఇచ్చిన నివేధిక‌లో అంకెలు త‌క్కువ చేసి చూపించింది. కానీ, ఇరాన్ ఎంత‌లా క‌రోనాతో ప్ర‌భావం అయిందో ఆ దేశ‌ప్ర‌జ‌లు సామాజిక మాధ్య‌మాల పోస్టుల ఆధారంగా బ‌య‌ట‌కు తెలిసింది.


అక్క‌డ స్మ‌శానాలు నిండిపోయేంత‌గా ప‌రిస్థితి దిగ‌జారిపోయింద‌ని తెలిసింది.  అయితే, ఇరాన్ చైనాతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాక్సిన్‌లు తీసుకుంది. స‌హ‌జంగానే చైనా వ‌స్తువులు ఎలా నాసిరకంగా ఉంటాయో అదే విధంగా వ్యాక్సిన్ కూడా ప‌ని తీరు కూడా స‌రిగ్గా లేద‌ని వెల్ల‌డ‌యింది.  దీంతో ఇరాన్ భార‌త్ వ్యాక్సిన్  కావాల‌ని భార‌త ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసింది. దీంతో మ‌న వ్యాక్సిన్లు అయిన కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండు క‌లిపి 10 ల‌క్ష‌ల డోసుల‌ను ఇరాన్‌కు పంపించ‌డానికి భార‌త ప్ర‌భుత్వం ఒప్పుకుంది.


అయితే, పాకిస్తాన్‌తో సాన్నిహిత్యం పెంచుకుంటున్న ఇరాన్‌కు నిజ‌మైన స‌హ‌జ‌మైన మిత్రులు ఎవ‌రైనా ఉన్నారంటే అది భార‌త దేశం మాత్రమే. గ‌తంలో అనేక సార్లూ ఇరాన్‌కు భార‌త్ స‌హాయం చేసింది. ప్ర‌పంచం అంతా వెలివేసిన సంద‌ర్భంలో భార‌త్ ఇరాన్‌కు బియ్యం అందించింది. అలాగే స‌హ‌జ వ‌న‌రుల‌కు తోడ్పాటునిచ్చింది. మ‌నం కేవ‌లం ఆయిల్ త‌ప్పించి మ‌రేది కూడా ఇరాన్ నుంచి తీసుకోలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: