తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ పార్టీకి చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్క చూపులు చూస్తున్నట్లే తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీలో రోజు రోజుకు ఆద‌ర‌ణ త‌గ్గుతోన్న నేప‌థ్యంలో ఆయ‌న త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు పై త్వ‌ర‌లోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది అని అంటున్నారు. ఈ మేరకు ఆయన సంకేతాలు కూడా ఇస్తున్న‌ట్టు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో పుకార్లు ఒక్క‌టే గుప్పు మంటున్నాయి. ఆయ‌న ఓ మాజీ ఎంపీగా త‌న కేడ‌ర్ ను జిల్లా లో కాపాడు కునేందుకు అష్ట క‌ష్టాలు ప‌డుతున్నారు. త‌న‌కే ప‌ద‌వి లేక‌పోవ‌డంతో ఆయ‌న త‌న అనుచ‌రుల‌కు మాత్రం ఏం ప‌ద‌వి ఇప్పించుకుంటార‌ని కొంద‌రు సెటైర్లు వేస్తున్నారు.

ఇక పొంగులేటి 2014లో రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో వైసీపీ నుంచి ఖ‌మ్మం ఎంపీగా గెలిచారు. త‌ర్వాత కొద్ది రోజుల‌కే ఆయ‌న కారు ఎక్కేశారు. ఆయ‌న సిట్టింగ్ ఎంపీగా ఉన్న‌ప్ప‌ట‌కి 2019 ఎన్నికలలో టీఆర్ఎస్ ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన నామా నాగేశ్వరరావుకు సీటు ఇచ్చింది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీ అయిపోయారు. అయితే త‌న‌కు రాజ్య‌స‌భ సీటు వ‌స్తుంద‌న్న ఆశ‌ల‌తో ఆయ‌న ఉన్నారు. అయితే జిల్లాలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ప్ర‌యార్టీ ఇవ్వాల్సి ఉన్న నేప‌థ్యంలో కేసీఆర్ పొంగులేటిని పెద్ద‌గా ప‌ట్టించు కోవ‌డం లేదు.

అయితే 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల‌లో అప్ప‌ట్లో కొంద‌రు టీఆర్ ఎస్ పార్టీ నేత‌ల ఓట‌మికి పొంగులేటి కార‌ణ‌మ‌య్యార‌న్న ఫిర్యాదులు కేసీఆర్ వ‌ద్ద‌కు వెళ్ల‌డంతోనే కేసీఆర్ ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశార‌ని అంటున్నారు. ఇక ఆయ‌న‌కు రాజ్య‌స‌భ వ‌స్తందన్న ఆశ‌లు ఉన్నా అది కూడా ద‌క్క‌లేదు. దీంతో ఆయ‌న రాజ‌కీయ రేసులో వెన‌క ప‌డిపోయారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లైట్ గా తీసుకుంటున్నారు.

ఇక ఎంపీ నామాతో పాటు మంత్రి పువ్వాడ సైతం పొంగులేటి వ‌ర్గానికి చిన్న ప‌ద‌వి కూడా రాకుండా చేస్తున్నారు. దీంతో ఆయ‌న కొద్ది రోజులుగా త‌న అనుచ‌రుల‌తో స‌మావేశం అవుతున్నారు. ఫైన‌ల్‌గా  ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలున్నాయంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: